ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్‌ఏఎస్).. 906 సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైతే దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందితే సరిపోతుంది. అలాగే ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసే, మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
అభ్యర్ధుల వయసు నవంబర్ 01, 2023 నాటికి 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 3 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌పోర్టులు, కార్గో కాంప్లెక్సుల్లో కార్గో స్క్రీనింగ్, సెక్యూరిటీ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 8, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750, ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కలర్ బ్లైండ్‌నెస్ దృశ్య, వినికిడి సమస్యలు ఉన్నవారు ఈ పోస్టులకు అనర్హులు. భావవ్యక్తీకరణ సామర్థ్యం, శారీరక దృఢత్వం ఉండాలి. వైద్య పరీక్షల అనంతరం ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్‌లో మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30,000 వేతనం చెల్లిస్తారు. రెండో ఏడాది రూ.32,000, మూడో ఏడాది రూ.34,000 ప్రతి నెలా జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కొన్ని కోర్సుల్లో శిక్షణనిస్తారు. ఈ కోర్సుల్లో అభ్యర్ధులు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేయాలి.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.