AIC Recruitment: అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలు జీతం పొందే ఛాన్స్‌.

|

Mar 25, 2023 | 9:29 PM

అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థలో ఉన్న మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా రూరల్‌ మేనేజ్‌మెంట్‌, లా విభాగాల్లో...

AIC Recruitment: అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలు జీతం పొందే ఛాన్స్‌.
Aic Jobs
Follow us on

అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థలో ఉన్న మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా రూరల్‌ మేనేజ్‌మెంట్‌, లా విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రూరల్‌ మేనేజ్‌మెంట్‌, లా విభాగాల్లో ఉన్న మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ & కోఆపరేషన్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్‌, లా) పీజీ ఎంబీఏ (రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) పీజీ డిప్లొమా (రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పరీక్షా కేంద్రాలను హైదరాబాద్‌, ఖమ్మంలో ఏర్పాటు చేయనున్నారు.

* ఎంపికైన అభ్యర్థులను 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 06 చివరి తేదీగా నిర్ణయించారు.

* ఆన్‌లైన్‌ పరీక్ష తేదీని ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..