AFCAT Notification 2022: ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌- ఏఫ్‌క్యాట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. అవివాహిత యువతకు అవకాశం!

భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (IAF - AFCAT) 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

AFCAT Notification 2022: ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌- ఏఫ్‌క్యాట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. అవివాహిత యువతకు అవకాశం!
Afcat Notification
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2022 | 9:50 AM

AFCAT 2 Recruitment Notification 2022: భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (IAF – AFCAT) 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్‌, నాన్-టెక్నికల్) బ్రాంచుల్లో కమీషన్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ చేయనుంది. జూలై 2023లో ప్రారంభమయ్యే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటియోరాలజీ ఎంట్రీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: ఇంకా ప్రకటించలేదు

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (AFCAT 2/ 2022)

  • ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ

బ్రాంచులు: ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌), గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్‌).

  • మెటీయోరాల‌జీ ఎంట్రీ (మెటియోరాలజీ)
  • ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ (ఫ్లైయింగ్‌)

పే స్కేల్‌: నెలకు రూ. 56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు జులై 1, 2023 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలినవాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2,1997 నుంచి జులై 1, 2003ల మధ్య జన్మించి ఉండాలి.

అర్హతలు: అవివాహిత యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. శరీరంపై ఏ భాగంలోనైనా ట్యాటూ ఉన్న వ్యక్తులు అనర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు రుసుము:

  • ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ అభ్యర్థులకు: రూ.250
  • మిగ‌తా ఎంట్రీల‌కు ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జూన్‌ 1, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.