Layoffs: వేలాడుతోన్న లేఆఫ్స్ కత్తి.. భారత్‌లో లక్షకు పైగా ఉద్యోగాలకు ఎసరు. నివేదికలో షాకింగ్ విషయాలు..
2023 అలా మొదలైందో లేదో ప్రపంచవ్యాప్తంగా ఐటీరంగం కుదేలైపోయింది. స్టార్టప్స్ నుంచి దిగ్గజ ఐటీ కంపెనీల వరకు ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. ఐటీ సంస్థల్లో లే-ఆఫ్స్ ఇప్పుడు కామన్‌గా మారింది. గూగూల్, మెటా, ట్విట్టర్, అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాప్ట్, SAP, సేల్స్ ఫోర్స్, ఐబీఎం...
2023 అలా మొదలైందో లేదో ప్రపంచవ్యాప్తంగా ఐటీరంగం కుదేలైపోయింది. స్టార్టప్స్ నుంచి దిగ్గజ ఐటీ కంపెనీల వరకు ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ఐటీ సంస్థల్లో లే-ఆఫ్స్ ఇప్పుడు కామన్‌గా మారింది. గూగూల్, మెటా, ట్విట్టర్, అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాప్ట్, SAP, సేల్స్ ఫోర్స్, ఐబీఎం, సేల్స్‌ఫోర్స్, స్పాటిఫై, ఇంటెల్, గోల్డ్‌మన్ సాక్స్, కాయిన్‌బేస్, అడోబ్, HP, సిస్కో, ఒపెన్ డోర్, ఒరాకిల్- ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి కంపెనీలు వందల్లో ఉన్నాయి. ఇలా ప్రతీ కంపెనీ ఉద్యోగులను వదిలించుకునే పనిలో ఉంది.
ఇదిలా ఉంటే తాజా రిపోర్ట్ ప్రకారం రానున్న ఆరు నెలల్లో భారత ఐటీ కంపెనీలు ఏకంగా 80 నుంచి 1.20 లక్షల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో పలు ఐటీ సంస్థల హెచ్‌ఆర్ సిబ్బంది కంపెనీకి భారంగా మారిన ఉద్యోగుల జాబితాను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగ కోతలు తప్పవని నివేదికలో తేలింది. ఇప్పటి వరకు భారత్‌కు చెందిన డుంజో, షేర్‌చాట్, రెబెల్ ఫూడ్స్, భారత్ అగ్రీ, ఓలా, క్యాష్‌ఫ్రీ వంటి కంపెనీలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
ఇక కొత్త ఏడాది మొదలైన నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 70 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరగనుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 219 కంపెనీలు 68149 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరి తొలి రెండు వారాల్లో 25 వేలమంది ఉద్యోగుల తొలగింపు జరగ్గా, ఆ తర్వాత వారంలో ఈ సంఖ్య రెట్టింపు అయిపోయింది. ఇదిలా ఉంటే ఐటీలోనే కాకుండా కాదు మీడియా, ఇతర రంగాల్లోనూ కోతలు కనిపిస్తున్నాయి. స్పాటిఫై 588 మంది ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఇండియన్ ప్రొఫెషనల్స్ సంఖ్య ఎక్కువ కనిపిస్తోంది. లేఆఫ్ నోటీసు అందుకున్న వాళ్లు 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగాలు వెదుక్కోవాల్సి ఉంటుంది. కాని, ప్రస్తుతం ఉద్యోగాల కోత జోరుగా సాగుతున్న వేళ్ల కొత్త జాబ్ దొరకడం అంతా ఈజీ కానే కాదు. లేని పక్షంలో వాళ్లు అమెరికాను వదిలిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..