Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

| Edited By: Anil kumar poka

Jan 23, 2022 | 9:24 AM

Tirupati IIT: ఆంధ్రప్రదేశ్ లో కరోనా బుసలు కొడుతోంది. రోజుకు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..
Iit Tirupati
Follow us on

Tirupati IIT: ఆంధ్రప్రదేశ్ లో కరోనా బుసలు కొడుతోంది. రోజుకు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా 12 వేలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. ఇక రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటపెడుతున్నాయి.  ఇటీవల ప్రకాశం జిల్లాలోని ఓ పాఠశాలలో ఏకంగా 147 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో 70 మంది కరోనా బారిన పడ్డారు. ఏర్పేడు మండలంలోని ఐఐటీ శాశ్వత ప్రాంగణంలో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇన్ని కేసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 40 మంది విద్యార్థులు కాగా, 30 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరూ ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా సంక్రాంతి సెలవుల కోసం ఈ నెల మొదటి వారంలో ఐఐటీ క్యాంపస్ లోని 600 మంది విద్యార్థులు తమ సొంత వూళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ఇంజినీరింగ్, ఎంటెక్, పీహెచ్ డీ చివరి సంవత్సవరం విద్యార్థులు మాత్రమే క్యాంపస్ లో ఉన్నారు. కాగా క్యాంపస్ లో కొవిడ్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.  మరోవైపు చిత్తూరు జిల్లాలోనూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా 1566 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Also Read: RECPDCL Recruitment: బీటెక్‌, ఎంబీఏ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Viral Photos: హరిద్వార్ పవిత్రమైన స్నానానికే కాదు.. ఈ ప్రదేశాలకు కూడా చాలా ఫేమస్..