AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News.. ఇక యథావిధిగా ఎస్‌ బ్యాంక్ కార్యకలాపాలు..

ఎస్ బ్యాంక్ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. బ్యాంక్‌పై ఉన్న మారిటోరియంను ఎత్తివేసింది. దీంతో బుధవారం సాయంత్రం 6.00 గంటల నుంచి బ్యాంకు అన్ని కర్యాకలాపాల ప్రారంభమయ్యాయి. దీంతో గురువారం నుంచి ఎస్‌బ్యాంక్‌కు చెందిన 1132 బ్రాంచీలన్నింటిలో బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. అంతేకాదు.. రూ.50వేల విత్ డ్రా లిమిట్‌ను కూడా అధికారులు ఎత్తివేశారు. ఈ సందర్భంగా ఎస్ బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. మార్చి 19 వ […]

Good News.. ఇక యథావిధిగా ఎస్‌ బ్యాంక్ కార్యకలాపాలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 18, 2020 | 7:33 PM

Share

ఎస్ బ్యాంక్ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. బ్యాంక్‌పై ఉన్న మారిటోరియంను ఎత్తివేసింది. దీంతో బుధవారం సాయంత్రం 6.00 గంటల నుంచి బ్యాంకు అన్ని కర్యాకలాపాల ప్రారంభమయ్యాయి. దీంతో గురువారం నుంచి ఎస్‌బ్యాంక్‌కు చెందిన 1132 బ్రాంచీలన్నింటిలో బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. అంతేకాదు.. రూ.50వేల విత్ డ్రా లిమిట్‌ను కూడా అధికారులు ఎత్తివేశారు. ఈ సందర్భంగా ఎస్ బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. మార్చి 19 వ తేదీ నుంచి 21 వరకు ఉదయం 8.30 నిమిషాలకే బ్రాంచులన్నీ ఓపెన్ అవుతాయని.. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ కోసం.. మార్చి 19 నుంచి 27 వ తేదీ వరకు సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు సేవలందించనున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొంది.

కాగా.. సంక్షోభంలో ఉన్న ఈ బ్యాంకును.. బ్యాంకుల పునరుధ్ధరణ పథకంలో భాగంగా రిజర్వ్ బ్యాంకు సూచనపై ఎస్‌.బీ.ఐ ఇందులో 49 శాతం పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోద ముద్ర వేసింది. ఎస్ బ్యాంకు అధీకృత షేర్ కేపిటల్ మొత్తాన్ని రూ. 1100 కోట్ల నుంచి రూ. 6,200 కోట్లకు పెంచి సవరించనున్నారు. అటు- ఎస్‌.బీ.ఐతో బాటు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ వంటి ఇతర బ్యాంకులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.

Our banking services are now operational. You can now experience the full suite of our services. Thank you for your patience and co-operation. #YESforYOU @RBI @FinMinIndia

— YES BANK (@YESBANK) March 18, 2020