AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamaha Electric Scooter: ఆ స్కూటర్‌ గురించి అదిరే అప్‌డేట్‌.. ఇక ముహూర్తమే తరువాయి.. సరికొత్త స్పోర్ట్స్‌ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా..

యమహా కూడా గతేడాది యమహా నియో పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన బ్యాటరీలు, అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నట్లు వెల్లడించింది. త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే ఈ యమహా నియో స్కూటర్‌ కు సంబంధించిన ఓ కొత్త అప్ డేట్ ఇప్పుడు మార్కెట్ ను షేక్  చేస్తోంది.

Yamaha Electric Scooter: ఆ స్కూటర్‌ గురించి అదిరే అప్‌డేట్‌.. ఇక ముహూర్తమే తరువాయి.. సరికొత్త స్పోర్ట్స్‌ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా..
Yamaha Neo Electric Scooter
Madhu
|

Updated on: Apr 22, 2023 | 5:00 PM

Share

ద్విచక్ర వాహనాలలో యమహా కంపెనీకి చెందిన వాటికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆ కంపెనీ ఏ కొత్త ఉత్పత్తి వచ్చినా వినియోగదారులు ఆసక్తిగా చూస్తారు. యమహా కంపెనీ కూడా వినియోగదారుల తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. వారి అంచనాలకు అనుగుణంగానే యమహా తమ ఉత్పత్తులను మా‍ర్కెట్లోకి తీసుకొస్తోంది. అయితే ప్రస్తుతం ఆటో మొబైల్‌ మార్కెట్‌ అంతా విద్యుత్‌ శ్రేణి వాహనాలే కనిపిస్తున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జనాలకు ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు ఆకర్షితులను చేస్తోంది. ఈ క్రమంలో అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్‌ టూ వీలర్లను లాంచ్‌ చేస్తున్నాయి. యమహా కూడా గతేడాది యమహా నియో పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన బ్యాటరీలు, అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నట్లు ప్రకటించింది. త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే ఈ యమహా నియో స్కూటర్‌ కు సంబంధించిన ఓ కొత్త అప్ డేట్ ఇప్పుడు మార్కెట్ ను షేక్  చేస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సామర్థ్యం.. యమహా నియో స్కూటర్‌లో 50.4V, 19.2Ah సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మార్చుకోదగిన ట్విన్‌ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది. ఒకే బ్యాటరీని ఉపయోగిస్తున్నప్పుడు దీని రేంజ్‌ సుమారు 38.5 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. అయితే రెండు బ్యాటరీలను ఉపయోగించడం ద్వారా ఈ రేంజ్‌ ని 68 కిలోమీటర్లకు పెంచవచ్చు. ఈ బ్యాటరీని సాధారణ చార్జర్‌ తో ఫుల్‌ చార్జ్‌ చేయడానికి సుమారు 8 గంటలు పడుతుంది. దీనిలోని మోటార్‌ ఇది ఎకో మోడ్‌లో 1.58kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే సాధారణ మోడ్‌లో 2.5kW, 136 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లు.. యమహా నియోలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.స్మార్ట్ కీ, స్మార్ట్‌ఫోన్‌లకు అనుకూలమైన ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. రూట్ ట్రాకింగ్, కాల్, మెసేజ్ వ్యూయింగ్ చేయడానికి ఈ స్ర్కీన్‌ బాగా ఉపయోగపడుతుంది. సీటు కింద 27-లీటర్ల స్టోరేజ్‌ సామర్థ్యంతో కూడిన స్పేస్‌ ఉంటుంది. అలాగే దీనిలోని బ్యాటరీ చార్జింగ్‌ లెవెల్‌ వంటివి కూడా డిస్‌ప్లే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే.. యమహా నియో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అలాగే దీని ధరను కూడా కంపెనీ ‍ప్రకటించలేదు. అయితే పలు మార్కెట్‌ నివేదికల అంచనా ప్రకారం దీని ధర రూ. 2,500,000 ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..