Yamaha Bikes: యమహా బైక్ ప్రియులకు గుడ్ న్యూస్.. నమ్మలేని వారెంటీ స్కీమ్ ప్రకటన
భారతదేశంలో యమహా బైక్స్ యువతో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా యమహా కంపెనీ రిలీజ్ చేసే సూపర్ బైక్స్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ బైక్స్ నిర్వహణ విషయంలో వినియోగదారులు ఇబ్బందిపడుతూ ఉంటారు. అనుకోకుండా అయ్యే రిపేర్స్‌కే ఎక్కువ మొత్తం సొమ్ము పెట్టాల్సి వస్తుందని ఆవేదన చెందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి యమహా శుభవార్త చెప్పింది. తన వారెంటీ స్కీమ్‌ను సవరిస్తూ ప్రకటన విడుదల చేసింది.

యమహా మోటార్ తన ద్విచక్ర వాహనాలకు 10 సంవత్సరాల ఫుల్ వారంటీ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పది సంవత్సరాల ఫుల్ వారంటీలో 2 సంవత్సరాల ప్రామాణిక వారంటీ, ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో సహా ఇంజిన్, ఎలక్ట్రికల్ భాగాలను కవర్ చేసే అదనపు 8 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉన్నాయి. యమహా బైక్‌లు స్కూటర్లు ఇప్పుడు 1,00,000 కి.మీ వరకు కవరేజ్ వారంటీని పొందుతాయి. అయితే భారతదేశంలో తయారు చేసిన బైక్స్‌కు అయితే 1,25,000 కి.మీ వరకు వారెంటీ కవర్ అవుతుందని ప్రకటించారు. అలాగే స్కూటర్లు 24,000 కి.మీ వరకు కవర్ అవుతాయి. ఎక్స్‌టెండెడ్ వారంటీ 76,000 కి.మీ వరకు ఉంటుంది. మోటార్ సైకిళ్లకు, ప్రామాణిక వారంటీ 30,000 కి.మీ వరకు ఉండగా, ఎక్స్‌టెండెడ్ వారంటీ 95,000 కి.మీ వరకు ఉంటుంది.
యమహా హైబ్రిడ్ స్కూటర్ శ్రేణిలో రే జెడ్ఆర్ ఎఫ్ఐ, ఫాసినో 125 ఎఫ్ఐ ఉన్నాయి. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఒక మ్యాక్సీ స్కూటర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఏరోక్స్ 155 పేరుతో ఈ స్కూటర్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. భారతదేశంలో తయారు చేసిన మోటార్ సైకిల్ శ్రేణిలో ఎఫ్‌జెడ్ సిరీస్, ఆర్15, ఎంటీ-15 ఉన్నాయి. ఈ బ్రాండ్ ఎంటీ-03, వైజెడ్‌ఎఫ్-ఆర్3లను కూడా విక్రయిస్తుంది. 2025 యమహా ఏరోక్స్ 155 ఎస్ ఇప్పుడు రిఫ్రెష్ చేసిన రంగు ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ తాజా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఓబీడీ2 అనుకూల ఇంజిన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కొత్త రంగుల్లో ఐస్ ఫ్లూ వెర్మిలియన్, రేసింగ్ బ్లూ వేరియంట్ ఉంటాయి. ఈ స్కూటర్ ధర రూ.1,53,430గా ఉంది. ఈ స్కూటర్ ప్రస్తుత మెటాలిక్ బ్లాక్ వేరియంట్ రూ.1,50,130కు కొనుగోలు చేయవచ్చు. ఏరోక్స్ ఇప్పటికీ బ్లూ స్క్వేర్ డీలర్షిప్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
యమహా ఏరోక్స్ 155 లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ ఎస్ఓహెచ్‌సీ 155 సీసీ ఇంజిన్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ స్కూటర్ 8,000 ఆర్‌పీఎం వద్ద 14.8 బీహెచ్‌పీ గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను రిలీజ్ చేసింది. 6,500 ఆర్‌పీఎం వద్ద 13.9 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ సీవీటీ ట్రాన్స్ మిషన్‌తో ఇంజిన్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (వీవీఏ)తో ఆకట్టుకుంటుంది. ఈ బైక్‌ను ఈ20 పెట్రోల్‌తో నడపాల్సి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ కంటే ఎస్-ట్రిమ్ కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ వల్ల స్టార్టప్ ప్రక్రియను సులభంగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ కీని గుర్తించడానికి ప్రాక్సిమిటీ డిటెక్షన్‌ను ఉపయోగిస్తుంది. యమహా ఆడిబుల్ బజర్, ఆన్సర్- బ్యాక్ కార్యాచరణ, ఫ్లాషింగ్ టర్న్ సిగ్నల్స్ వంటి లక్షణాలతో ఆకట్టుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








