EV Scooter: 2025 వెర్షన్ టీవీఎస్ ఐక్యూబ్ రిలీజ్.. బ్యాటరీ విషయంలో తగ్గేదేలే..!
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఈ స్కూటర్లను వినియోగించడానికి ఇష్టపడడంతో అన్ని కంపెనీలు ఈవీ వెర్షన్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన మోడల్స్ నయా వెర్షన్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ తన ఈవీ స్కూటర్ ఐక్యూబ్‌లో 2025 వెర్షన్ లాంచ్ చేసింది. ఈ నపథ్యంల్ 2025 వెర్షన్ టీవీఎస్ ఐక్యూబ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఐక్యూబ్ వెర్షన్‌ను భారత మార్కెట్‌లో నిశ్శబ్దంగా విడుదల చేసింది. టీవీఎస్-ఎస్, ఎస్టీ వేరియంట్ రెండూ అప్‌డేట్ చేశారు. ముఖ్యంగా టీవీఎస్ కంపెనీ బ్యాటరీ ప్యాక్‌లకు కీలక మార్పులు చేశారు. 2025 వెర్షన్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు, ధర సవరణ కూడా ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్ప్లేతో అందుబాటులో ఉంటే ఎస్ వేరియంట్ ఇప్పుడు రూ.1.18 లక్షలకే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కస్టమర్లు ఐదు అంగుళాల టీఎఫ్‌టీ క్లస్టర్‌ను ఎంచుకుంటే కేవలం రూ.1.09 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటర్ ప్యాక్‌తో రూ.1.28 లక్షలకు అందుబాటులో ఉంటే 5.1 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌ను రూ.1.59 లక్షలతో అందుబాటులో ఉంచారు. 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఐక్యూబ్ 145 కి.మీ.ల రేంజ్ ని కలిగి ఉండగా, 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ 212 కిలో మీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్‌ను కొత్త లేత గోధుమరంగు లోపలి ప్యానెల్స్, డ్యూయల్-టోన్ సీటు, ఇంటిగ్రేటెడ్ పిలియన్ బ్యాక్స్ట్ వంటి అప్‌డేట్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే ఈ స్కూటర్స్‌లో ఎలాంటి ప్రధాన మార్పులు లేవని కస్టమర్లు గమనించాలి.
టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం హబ్ మోటారును ఉపయోగిస్తుంది. ఇది గరిష్టంగా 4.4 కేడబ్లయూ లేదా 5.90 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఐక్యూబ్ ఈవీ స్కూటర్ 4.2 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ టాప్-ఎండ్ ఎస్టీ వేరియంట్ 4.5 సెకన్లు పడుతుంది. 2.2 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ గరిష్ట వేగం 75 కిలోమీటర్లు కాగా 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగిన టాప్-ఎండ్ ఎస్టీ గంటకు 82 కిలో మీటర్లు వేగాన్ని అందుకుంటుంది. మిగిలిన వెర్షన్లు గంటకు 78 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








