Xiaomi Mi Mix: మార్కెట్లో విడుదలైన షియోమీ ఫోల్డబుల్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి..

Xiaomi Mi Mix: మొబైల్‌ ప్రియులను మరింత ఆకర్షించేందుకు వివిధ మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు రోజురోజుకు సరికొత్త మోడళ్లలను ఫోన్‌లను మార్కెట్లోకి వదులుతున్నాయి. కరోనా కాలంలో...

Xiaomi Mi Mix: మార్కెట్లో విడుదలైన షియోమీ ఫోల్డబుల్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి..
Xiaomi
Follow us
Subhash Goud

|

Updated on: Mar 31, 2021 | 10:01 PM

Xiaomi Mi Mix: మొబైల్‌ ప్రియులను మరింత ఆకర్షించేందుకు వివిధ మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు రోజురోజుకు సరికొత్త మోడళ్లలను ఫోన్‌లను మార్కెట్లోకి వదులుతున్నాయి. కరోనా కాలంలో మొబైల్‌ ఉత్పత్తులు కాస్త తగ్గుముఖం పట్టినా… ప్రస్తుతం ఉత్పత్తులను మరింత పెంచాయి. ఇక చైనా స్మార్ట్‌ ఫోన్‌ మేకర్‌ షియోమీ తనమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Mi మిక్స్‌ ఫోల్డ్‌ పేరుతో ఈ ఫోన్‌ను ప్రపంచమార్కెట్లోకి ఆవిష్కరించింది. ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఫోన్‌ దిగువన సెల్ఫీ కెమెరా ఉంది. 2K స్క్రీన్‌, డెస్క్‌టాప్‌ మోడ్‌, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వెనకవైపు క్వాడ్‌ కెమెరా సెటప్‌ వంటి అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో విడుదలైంది.

కాగా, మిక్స్‌ ఫోల్డ్‌లో రెండు స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి సింగిల్‌ ఔటర్‌ స్క్రీన్‌ కాగా మరొకటి ఫోల్డింగ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లే. గెలాక్సీ ఫోల్డ్‌ 2 మాదిరిగా ఔటర్‌ డిస్‌ప్లేలో లార్జ్‌ ఫుల్‌ స్క్రిన్‌ ఉంటుంది. ఔటర్‌ స్క్రీన్‌ 6.52 అంగుళాల అమోలెడ్‌ ప్యానెల్‌ను కలిగి ఉండగా ఇన్నర్‌ ఫోల్డింగ్‌ స్క్రీన్‌ సైజు 8.01 అంగుళాలతో ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 2, హువావే మేట్‌ X2 మడతబెట్టే ఫోన్లకు మార్కెట్లో మిక్స్‌ ఫోల్డ్‌ గట్టి పోటీ ఇవ్వనుంది.

Mi మిక్స్‌ ఫోల్డ్‌ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:8.01 అంగుళాలు ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ఫ్రంట్‌ కెమెరా:20 ఎంపీ రియర్‌ కెమెరా:108+8+13 ఎంపీ ర్యామ్‌:12జీబీ స్టోరేజ్‌:256జీబీ బ్యాటరీ:5020mAh ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

ఇవీ చదవండి: High Speed Internet: హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు కొత్త పరికరం.. అభివృద్ధి చేసిన ఆస్ట్రోమ్‌ స్టార్టప్‌

Google Maps: మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన గూగుల్.. ఆ ఫిచర్‌తో ప్రయోజనాలేంటంటే..