Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Speed Internet: హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు కొత్త పరికరం.. అభివృద్ధి చేసిన ఆస్ట్రోమ్‌ స్టార్టప్‌

High speed internet: ప్రస్తుతం ఇంటర్నెట్‌ లేకుండా ఎలాంటి పనులు జరిగే అవకాశాలు లేవు. ప్రతిది కూడా ఇంటర్నెట్‌ ద్వారానే జరిగే రోజులివి. ప్రస్తుతం ఇంటర్నెట్‌ లేనిది ఎవ్వరు..

High Speed Internet: హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు కొత్త పరికరం.. అభివృద్ధి చేసిన ఆస్ట్రోమ్‌ స్టార్టప్‌
High Speed Internet
Follow us
Subhash Goud

|

Updated on: Mar 31, 2021 | 4:32 PM

High Speed Internet: ప్రస్తుతం ఇంటర్నెట్‌ లేకుండా ఎలాంటి పనులు జరిగే అవకాశాలు లేవు. ప్రతిది కూడా ఇంటర్నెట్‌ ద్వారానే జరిగే రోజులివి. ప్రస్తుతం ఇంటర్నెట్‌ లేనిది ఎవ్వరు ఉండటం లేదు. మన దేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం ఇంటర్నె్‌ట్‌ సదుపాయంతో ఎన్నో రకాల సేవలను పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు అధిక వేగంతో ఉండే ఇంటర్నెట్‌ సేవలను కోరుకుంటున్నారు. దీంతో టెలికాం, డేటా ప్రొవైడింగ్‌ సంస్థలు ఫైబర్‌ టెక్నాలజీ ద్వారా హైస్పీడ్‌ ఆశిస్తున్నారు. దీంతో డేటా ప్రొవైడింగ్‌ సంస్థలు, ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీ ద్వారా హైస్పీడ్‌ సేవలను అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ సాంకేతికత పరిధిని పెంచడం ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు బెంగళూరుకు చెందిన ఆస్ట్రోమ్‌ స్టార్టప్‌ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీనిని నేహా శతక్‌ అనే మహిళ స్థాపించారు. ఈ స్టార్టప్‌ డెవలప్ చేసిన ‘గిగా మెష్‌’ అనే డివైజ్‌ ద్వారా టెలికామ్‌ ఆపరేటర్లు మారుమూల ప్రాంతాలకు సైతం తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్‌ సేవలను అందించవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ వేయడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దీంతో ఆప్టికల్‌ ఫైబర్‌కు వైర్‌లెస్‌ బ్యాక్‌ హాల్‌ ప్రొడక్ట్‌లను ప్రత్యామ్నాయాలుగా భివిస్తున్నారు.

వైర్‌లెస్‌ బ్యాక్‌ హాల్‌ ప్రొడక్ట్‌ల పనితీరులో ఎన్నో లోపాలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్‌ బ్యాక్‌ హాల్‌ ప్రొడక్ట్‌ల పనితీరులో ఎన్నో లోపాలున్నాయి. ఈ సేవలను పొందేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు డేటా స్పీడ్‌, నెట్‌ వర్క్ పరిధి పెరగడం లేదు. ఈ నేపథ్యంలో గిగా మెష్‌ అనే వైర్‌లెస్‌ ప్రొడక్ట్‌ టెలికామ్‌ ఆపరేటర్‌ను అస్ర్టోమ్‌ స్టార్టప్‌ అభివృద్ధి చేసింది. ఈ వైర్‌లెస్‌ డివైజ్‌ ద్వారా టెలికాం ఆపరేటర్లు ఐదు రేట్లు తక్కువ ఖర్చుతో నాణ్యమైన, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించవచ్చు.

కాగా, ఆస్ట్రోమ్ స్టార్టప్‌ను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ప్రారంభించారు. ఈస్టార్టప్‌ గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరలో ఇంటర్నెట్‌ అందించడమే లక్ష్యంగా పరిశోధనలు చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన ఉమెన్‌ స్టార్టప్‌ ప్రోగ్రామ్‌.. ఈ సంస్థకు తోడ్పాటు అందించింది. ఆస్ట్రోమ్‌ సంస్థ 2018 మిల్లీమీటర్‌ వేవ్‌ మల్టీ బీమ్‌తో కూడిన టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీనికి భారత్‌, అమెరికా పేటెంట్‌ సైతం దక్కింది. ఈ టెక్నాలజీపై మరిన్ని పరిశోధనలు చేసి గిగా మెష్‌ వైర్‌లెస్‌ డివైజ్‌ను పరిశోధకులు డెవలప్‌ చేశారు. క్షేత్ర స్థాయి ప్రయోగాల్లో దీని సామర్థ్యం రుజువైంది.ఈ టెక్నాలజీకి ఇంటర్నేషనల్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ సంస్థ నుంచి ఎస్‌ఎంఎస్‌ అవార్డు కూడా రావడం విశేషం.

ఇవీ చదవండి: Google Maps: మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన గూగుల్.. ఆ ఫిచర్‌తో ప్రయోజనాలేంటంటే..

New Scam In WhatApp: ఉచితమని క్లిక్‌ చేశారో మీ పని గోవిందా..? జియో రీఛార్జ్‌ పేరుతో వాట్సాప్‌లో మోసపూరిత లింక్‌..