Business Idea: నెలకు రూ.2 లక్షలు సంపాదించడమే మీ లక్ష్యమా? ఎవరికీ తెలియని ఈ బిజినెస్ ట్రై చేయండి..

ఈరోజుల్లో చాలామంది ఉద్యోగాలకంటే బిజినెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా కాస్తంత విషయ పరిజ్ణానం ఉంటే చాలు ఈజీగా రాణించవచ్చు.

Business Idea: నెలకు రూ.2 లక్షలు సంపాదించడమే మీ లక్ష్యమా? ఎవరికీ తెలియని ఈ బిజినెస్ ట్రై చేయండి..
Business Idea

Edited By: Janardhan Veluru

Updated on: Mar 07, 2023 | 11:13 AM

ఈరోజుల్లో చాలామంది ఉద్యోగాలకంటే బిజినెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా కాస్తంత విషయ పరిజ్ణానం ఉంటే చాలు ఈజీగా రాణించవచ్చు. అందుకే చాలామంది యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి…తక్కువ కాలంలోనే లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓ చక్కటి వ్యాపార ఆలోచన గురించి మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేస్తే ఏడాదంతా మీకు సంపాదన ఉంటుంది. అంతేకాదు ఈ వ్యాపారంలో లాభాలు సులభంగా పొందే ఛాన్స్ ఉంటుంది. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫుడ్ ఇండస్ట్రీకి ఈ మధ్య విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా జనాభా పెరుగుతున్నా కొద్దీ ఈ వ్యాపారికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఫుడ్ ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న వ్యాపారాలను చేస్తే చక్కటి ఆదాయం సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ఓ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. చిరుధాన్యాల పట్ల నేటి కాలంలో ప్రజల్లో చాలా అవగాహన పెరిగింది. చిరుధాన్యాలతో చేసిన వంటలతో బిజినెస్ చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

మిల్లెట్స్ టిఫిన్:

ఇవి కూడా చదవండి

మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లయితే..మీకు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా చిరుధాన్యాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా చిరుధాన్యాల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. మిల్లెట్స్ తో ఉపయోగించి తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. మీరు ఈ మిల్లెట్స్ బిజినెస్ ప్రారంభిస్తే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఐడియా అయ్యే ఛాన్స్ ఉంది.

ఉదాహారణకు మిల్లెట్స్ తో తయారు చేసే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగలి, పాయసం, బిర్యానీ వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. రచితో పాటు చిరుధాన్యాల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి చిరుధాన్యాలతో తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ అందరికీ నచ్చే ఛాన్స్ ఉంటుంది.

ముందుగా మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటే మిల్లెట్స్ వల్ల కలిగే లాభాల గురించి ప్రచారం చేయాలి. ఇందుకోసం మీరు కరపత్రాలు, పేపర్ యాడ్స్ , డిజిటల్ మాధ్యమం ద్వారా యాడ్స్ వేయించినట్లయితే సులభంగా జనాల్లోకి చేరుతుంది. సాధారణ టిఫిన్లతోపాటు మిల్లెట్స్ టిఫిన్లు కూడా టిఫిన్ సెంటర్లో అందుబాటులో ఉంచినట్లయితే నెమ్మదిగా ప్రజలు మిల్లెట్స్ టిఫిన్ల పట్ల ఇష్టం పెంచుకుంటారు.

టెస్ట్‌తో పాటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడే ఈ వ్యాపారంలో మనం రాణిస్తాం. కాబట్టి ఈ ప్రాథమిక సూత్రాన్ని అస్సలు విస్మరించకూడదు. టిఫిన్ సెంటర్ డెవలప్ అయ్యే కొద్దీ ప్రచారం పెంచితే మరింత లాభం పొందవచ్చు. ఒక చోట విజయవంతం అయ్యిందంటే మరొచోట కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వీలైతే ప్రాంచైజింగ్ మోడల్స్ ను కూడా ఆఫర్ చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం