AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: వావ్! పిల్లలకు పేర్లు పెడుతూ కోట్లు సంపాదిస్తున్న మహిళ!

పిల్లలకు పేరు పెట్టడం కూడా ఒక బిజినెస్ అని మీకు తెలుసా? నిజమే అమెరికాలోని ఒక మహిళ దీన్నే ఒక బిజినెస్ గా మార్చుకుని ఏకంగా కోట్లు సంపాదిస్తుంది. ఈమె ఒక పేరు పెట్టినందుకు ఏకంగా పాతిక లక్షలు వసూలు చేస్తుందట!

Business Idea: వావ్! పిల్లలకు పేర్లు పెడుతూ కోట్లు సంపాదిస్తున్న మహిళ!
Taylor A Humphrey
Nikhil
|

Updated on: Oct 01, 2025 | 6:00 PM

Share

సాధారణంగా పిల్లలకు పేర్లు వాళ్ల పేరెంట్సే పెడుతుంటారు. కానీ, అమెరికాలో దీనికోసం కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీరినే ప్రొఫెషనల్ బేబీ నేమర్స్‌ అంటారు. అలాంటి ఒక బేబీ నేమర్ పేరు టేలర్ ఎ హంఫ్రీ. ఈమెకు కొత్త కొత్త పేర్లపై రీసెర్చ్ చేయడం, వాటిని మీనింగ్ ఫుల్ గాడిజైన్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండేదట. అయితే ఈ ఇంట్రెస్ట్ నే ఆమె బిజినెస్ గా మార్చుకుంది. పిల్లలకు పేర్లు పెడుతూ కోట్లు సంపాదిస్తోంది.

అభిరుచినే వృత్తిగా..

హంఫ్రీ పదేళ్ల క్రితం ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. మొదట్లో ఆన్ లైన్ లో తను క్రియేట్ చేసిన పేర్లను షేర్ చేస్తూ ఉండేది. వాటికి మంచి ఫాలోయింగ్ రావడంతో దాన్నే వృత్తిగా మార్చుకుంది. 2021లో ‘ది న్యూయార్కర్‌’లో ఆమెపై వచ్చిన ఒక కథనం తర్వాత ఆమె బిజినెస్ కు డిమాండ్ పెరిగింది. మొదట్లో ఆమెను చాలామంది విమర్శించేవారని.. కానీ, తాను చేసే పని చాలా విలువైనదిగా ఆమె భావిస్తున్నట్టు హంఫ్రీ చెప్పుకొచ్చింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో హంఫ్రీకు లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకూ ఆమె500  కంటే ఎక్కువ మంది పిల్లలకు పేర్లు పెట్టిందట.

ఎంతో రీసెర్చ్ చేసి..

అయితే హంఫ్రీ ఏదో ర్యాండమ్ గా పేర్లు పెట్టదు. దానికై చాలా రీసెర్చ్ చేస్తుంది. పేరెంట్స్ అభిరుచులు, ఇష్టాయిష్టాల నుంచి కుటుంబ వంశపారంపర్య వివరాల వరకూ అన్ని  తెలుసుకుంటుంది. పిల్లల తల్లిదండ్రులకు ఓ ప్రశ్నాపత్రం ఇచ్చి వారి నుంచి సమాధానాలు సేకరిస్తుంది. దాన్ని బట్టి మంచి మీనింగ్ ఉండేలా  వాళ్ల సంస్కృతి, విలువలను ప్రతిబింబించేలా పేరు పెడుతుంది. ఆమె చేసే రీసెర్చ్ ను బట్టి ఛార్జ్ చేస్తుంది. ఆమె చేసే రీసెర్చ్ ను బట్టి సుమారు రూ. 20 వేల నుంచి రూ. 25 లక్షల వరకూ ఛార్జ్ చేస్తుంది.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా