AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharukh Khan: బిలియనీర్‌‌గా మారిన బాద్‌షా… ఆస్తి ఎంతో తెలిస్తే మతి పోతుంది!

మొన్నటి వరకూ రిచెస్ట్ బాలీవుడ్ స్టార్ గా ఉన్న షారుఖ్ ఇప్పుడు అఫీషియల్ గా బిలియనీర్స్ క్లబ్ లో ఎంటర్ అయ్యాడు. M3M హురున్ సంస్థ.. 2024 సంవత్సరంలో భారత్ లోని అత్యంత సంపన్నుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తొలి సారి చోటు దక్కించుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.

Sharukh Khan: బిలియనీర్‌‌గా మారిన బాద్‌షా... ఆస్తి ఎంతో తెలిస్తే మతి పోతుంది!
Shahrukh Khan Billionaire
Nikhil
|

Updated on: Oct 01, 2025 | 5:22 PM

Share

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఇప్పుడు అధికారికంగా బిలియనీర్ క్లబ్‌లోకి ప్రవేశించారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో రూ. 12,490 కోట్ల ఆస్తితో షారుఖ్ అగ్రస్థానంలో నిలిచారు. హురున్ షారుఖ్‌ను బిలియనీర్‌గా గుర్తించడం ఇదే మొదటిసారి. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచే కాకుండా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ద్వారా కూడా షారుఖ్ భారీగా ఆస్తిని సంపాదించారు. దాంతో ఈ ఏడాది షారుక్ బిలియనీర్స్ జాబితాలో మొదటి స్థానం సంపాదించాడు.

టాప్ 5 లిస్ట్

ఈ జాబితాలో షారుఖ్ తర్వాత జూహి చావ్లా అండ్ ఫ్యామిలీ రూ.7,790 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. వీరికి కూడా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో వాటా ఉంది. ఇక ఆ తర్వాత హృతిక్ రోషన్ రూ.2,160 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. హృతిక్ కు హెచ్‌ఆర్‌‌ఎక్స్ (HRX) ఫిట్‌నెస్ బ్రాండ్  ఉంది. దాని ద్వారా ఈ ఆస్తి సమకూరి ఉండవచ్చు. ఇక కరణ్ జోహార్ రూ.1,880 కోట్లతో నాల్గవ స్థానంలో ఉండగా, అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ రూ.1,630 కోట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు.

షారుఖ్ ఆస్తులు

ఇక షారుఖ్ ఖాన్ విషయానికొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు చాలా రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన ఇంటి విలువ రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అలాగే ఆయనకు లండన్‌లోని పార్క్ లేన్‌లో ఒక అపార్ట్‌మెంట్, బెవర్లీ హిల్స్‌లోని ఒక విల్లా, అలీబాగ్‌లోని ఒక ఫామ్‌హౌస్, ఢిల్లీ, దుబాయ్‌లలో నివాసాలు, ఇంగ్లండ్‌లో వెకేషన్ రిట్రీట్ వంటి విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి.

లగ్జరీ కార్లు

షారుక్ దగ్గర లగ్జరీ ఆటోమొబైల్స్ కలక్షన్ కూడా ఉంది.  బీఎండబ్ల్యూ, బెంజ్, రోల్స్ రాయిస్‌.. ఇలా అతని గ్యారేజ్ లో చాలానే లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో బుగట్టి వెయ్రాన్ (రూ. 12 కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్(రూ. 9.5 కోట్లు) అత్యంత ఖరీదైన కార్లు. ఏదేమైనా ఒకప్పుడు జేబులో కేవలం రూ.1,500 తో ముంబైకి వచ్చానని చెప్పిన షారుఖ్ ఈ రోజు బిలియనీర్ క్లబ్ కు ఎదగడం అంటే అది కేవలం అతడి కష్టంతో సాధించిన విజయం అనే చెప్పాలి.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!