Stock Market: యుద్ధ భయం..వరుసగా ఆరోరోజూ నష్టాల్లో షేర్ మార్కెట్స్.. ఆ షేర్ల ధరలు మాత్రం పెరిగాయి!
Stock Market: రష్యా, ఉక్రెయిన్ ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. నిన్న 57300 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్(sensex).. ఓపెనింగ్ లో 332 పాయింట్లు పెరిగింది.
Stock Market: రష్యా, ఉక్రెయిన్ ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. నిన్న 57300 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్(sensex).. ఓపెనింగ్ లో 332 పాయింట్లు పెరిగింది. తరువాత క్రమంగా మరో వంద పాయింట్ల మేర పెరిగి గరిష్ఠంగా.. 57733 పాయింట్లకు చేరుకుంది. ఇదే సమయంలో రోజు లోని కనిష్ఠంగా 500 పాయింట్ల పడిన సూచీ ఒకనొక దశలో 57109 మార్కును తాకింది. సాయంత్రం మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి 57232 పాయింట్ల వద్ద స్థిరపడి 68 పాయింట్ల మైనస్ లో క్లోజ్ అయింది. మరో సూచీ నిఫ్టీ(nifty) 155 పాయింట్లు పెరిగి 17194 వద్ద ప్రారంభమైంది. తరువాత మరో 16 పాయింట్లు పెరిగిన సూచీ నేటి గరిష్ఠమైన 17220 న్ని తాకింది. మధ్యాహ్న సెషన్ లో మార్కెట్ ఒడిదొడుగులకు లోనవడంతో.. సూచీ పాయింట్ల కోల్పోయి రోజు కనిష్ఠమైన 17027ను తాకింది. చివరికి 29 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 17063 వద్ద క్లోజ్ అయ్యింది.
మార్కెట్లు స్వల్ప నష్టాలను నమోదు చేసినప్పటికీ బ్యాంకింగ్ రంగం నేడు కొంత ధృడంగా ఉండడంతో బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంత లాభాలలోనే ట్రేడ్ అయ్యింది. చివరికి 20 పాయింట్ల స్వల్ప లాభంతో 37392 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బీఎస్ఈ ఐపీవో సూచీలు మాత్రం లాభాల మధ్యనే ముగిశాయి. ప్రధానంగా ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు ఎక్కువ వత్తిడికి గురికావడంతో.. ఆ రంగానికి చెందిన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
ప్రధానంగా గమనించవలసిన మరో అంశం ఏమిటంటే.. కొత్తతరం టెక్ కంపెనీలైన జొమాటో, నైకా షేర్లు 5 శాతం పెరుగుదలను నమోదు చేయగా.. పేటిఎం షేరు ధర 2 శాతం వరకు పెరిగింది. గత కొంతకాలంగా ఈ స్టార్టప్ కంపెనీల షేర్లు వరుసగా పతనం కావడం వల్ల వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన రిటైల్ మదుపరులు ఆందోళనలో ఉన్నారు. మార్కెట్లు ఊగిసలాడుతున్నప్పటికీ.. ఈ టెక్ స్టార్టప్ షేర్లు పాజిటివ్ గా ఉండడం కొంత ఆశాజనకమైన అంశం. దీనికి తోడు రేడు డెరివేటివ్ సెగ్మెంగ్ నెల, వారాంతపు ఎక్స్ పయిరీ ఉండడంతో మార్కెట్లు కొంత మేర నెగటివ్ గానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవీ చదవండి..