AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold price: బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? రూ.2 లక్షల మార్క్ నిజమేనా?

ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 2025 సెప్టెంబర్ లో ఆల్ టైం హయ్యెస్ట్ గా రికార్డు సృష్టించాయి. బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ లో ధరలు ఇంకా పెరగబోతున్నాయా? ఎక్స్ పర్ట్స్ ఏమంటున్నారు?

Gold price: బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? రూ.2 లక్షల మార్క్ నిజమేనా?
Gold Prices Future
Nikhil
|

Updated on: Sep 24, 2025 | 6:11 PM

Share

ఒక్క 2025 ఏడాదిల లోనే బంగారం ధర 50 శాతం, వెండి ధర 55 శాతం చొప్పున పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైం హయ్యె్స్ట్ ప్రైస్ కు చేరుకుంది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 1,17,570 గా ఉంది. అయితే రాబోయే రెండేళ్లలో ఈ రేట్లు రూ.2 లక్షల మార్క్ ను దాటతాయని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 2 లక్షలు?

డాలర్ తో పోలిస్తే  రూపాయి విలువ బలహీనపడడంతో బంగారంలో పెట్టుబడుల డిమాండ్‌ పెరిగినట్టు తద్వారా మనదేశంలో గోల్డ్ రేట్లు పెరిగినట్టు ట్రేడర్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా బంగారంపై పెట్టుబడులు ఇంకా ఎక్కువ అవుతాయని.. ఫలితంగా గోల్డ్ రేట్లు పెరగడమే గానీ తగ్గడం ఉండదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  గడిచిన ఐదేళ్లలో (2020 – 2025) బంగారం ధర రెట్టింపు అయింది. పైగా ఈ మధ్యలో గోల్డ్ డిమాండ్ తగ్గే సూచనలు కనిపించట్లేదు. కాబట్టి  రాబోయే మూడు నాలుగేళ్లలో బంగారం ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

దాదాపు ఖాయమే..

గోల్డ్ రేట్లు వచ్చే ఏడాదిలో 15 నుంచి20 శాతం మేర పెరగొచ్చని చాలామంది ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రాబోయే ఏళ్లలో వరల్డ్ ఎకానమీలో కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని,  ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే తప్పకుండా రూ. 2 లక్షల మార్క్ ను అందుకుంటుందని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎక్స్ పర్ట్స్ వేస్తున్న అంచనాలు అన్నీ నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ. గోల్డ్ కొనాలనుకునేవాళ్లు లేదా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ధర తగ్గుతుందేమో అని వెయిట్ చేయకుండా ఇంకా పెరుగుతుందని గుర్తించి.. తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి