Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌లో రిస్టోరేషన్ బెనిఫిట్స్ ఎందుకు తప్పనిసరి?
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం కవర్ ఒకే సందర్భంలో అయిపోయే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య సమస్యలు లేదా రోడ్డు ప్రమాదాలు వంటి సమస్యలు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకునే వరకూ మీ తలుపు తట్టకుండా ఉండవు. అది ఆకస్మికంగా ఎప్పుడైనా మీపై వచ్చి పడొచ్చు. అందుకే అటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ పాలసీకి రిస్టోరేషన్ బెనిఫిట్స్ యాడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు రిస్టోరేషన్ బెనిఫిట్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మీ హెల్త్ ఇన్సూరెన్స్..
అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం చాలా అవసరం. అలాగే మీరు తీసుకునే పాలసీ మీకు అనుకోకుండా వచ్చే.. అన్ని హెల్త్ రిలేటడ్ ఖర్చులు.. అవసరాల కోసం అది సరిపోతుందా లేదా చూసుకోవడం మరింత అవసరం. ఇది తెలీక నితీష్ చేసిన తప్పు మీరు చేయకండి. అసలు నితీష్ చేసిన తప్పేమిటి? అసలేమైంది చూద్దాం. నితీష్ తల్లికి క్యాన్సర్ సోకింది. దీంతో హాస్పిటల్ లో చేర్చాడు. ఆమె కేన్సర్ చికిత్స కోసం బాగా ఖర్చు అయింది. ఈలోపు అతని కొడుకు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని కూడా హాస్పిటల్ లో చేర్పించారు. ఇక్కడే నితీష్ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందిలో చిక్కుకుపోయాడు. ఎందుకంటే, తన తల్లి కోసం అయినఖర్చుల కోసం ఆటను తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ లిమిట్ అయిపొయింది. ఇప్పుడు తన కొడుకు కోసం డబ్బు వెతుక్కోవాల్సిన పని పడింది. ఇప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడిన తన కుటుంబ సభ్యులు ఇద్దరి మెడికల్ అవసరాలు తీర్చడం ఆర్థికంగా నితీష్ కు చాలా ఎక్కువ భారంగా మారింది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం కవర్ ఒకే సందర్భంలో అయిపోయే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య సమస్యలు లేదా రోడ్డు ప్రమాదాలు వంటి సమస్యలు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకునే వరకూ మీ తలుపు తట్టకుండా ఉండవు. అది ఆకస్మికంగా ఎప్పుడైనా మీపై వచ్చి పడొచ్చు. అందుకే అటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ పాలసీకి రిస్టోరేషన్ బెనిఫిట్స్ యాడ్ చేసుకోవడం మంచిది.
ఇప్పుడు రిస్టోరేషన్ బెనిఫిట్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక గ్లాసు నీరు అనుకోండి. రిస్టోరేషన్ బెనిఫిట్స్ ఏమిటంటే, మీ గ్లాసు ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని రీఫిల్ చేసే కూజా లాంటిది అన్నమాట. రిస్టోరేషన్ బెనిఫిట్స్ మీ పాలసీ అయిపోయిన తర్వాత మీరు పూర్తి ప్రాథమిక బీమా మొత్తాన్ని తిరిగి పొందుతారు.
కంపెనీలు రెండు రకాల రిస్టోరేషన్ అషన్స్ అందిస్తాయి. అవి పూర్తి – పాక్షిక రెస్టోరేషన్ అషన్స్. పూర్తి రెస్టోరేషన్ కింద మీరు అసలు మొత్తాన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే పూర్తి ఇన్సూరెన్స్ మొత్తం రిస్టోరేషన్ అవుతుంది. అదే పాక్షిక రిస్టోరేషన్ కింద, మీ మొత్తం కవర్‌లో కొద్దిగా మొత్తం ఖర్చు అయినా కూడా పూర్తి బీమా మొత్తం రిస్టోర్ అవుతుంది.
నితేష్ రిస్టోరేషన్ బెనిఫిట్స్ ఎంచుకుని ఉంటే, ఆమె తల్లి చికిత్స కోసం రూ. 20 లక్షలు అయిపోయిన తర్వాత, పూర్తి పునరుద్ధరణలో అతను రూ. 20 లక్షలను పొంది ఉండేవాడు. వాస్తవానికి, అతను తన కొడుకు చికిత్సకు అవసరమైన రూ. 5 లక్షలను కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం దొరికేది. ప్లాన్ పాక్షిక రెస్టోరేషన్ అందించినప్పటికీ, అతని కుమారుని చికిత్స కోసం అతను క్లెయిమ్ చేసిన తర్వాత అతని బీమా మొత్తం రూ.15,00,000 నుంచి రూ.20,00,000కి తిరిగి వస్తుంది.
వ్యక్తిగత ఫైనాన్స్ నిపుణుడు విరాల్ భట్ మాట్లాడుతూ.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి రిస్టోరేషన్ బెనిఫిట్స్ విలువైన యాడ్-ఆన్ అని, ఎందుకంటే మీరు క్లెయిమ్ చేయవలసి వస్తే.. మీరు పాలసీ సంవత్సరంలో ఇప్పటికే మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పూర్తి చేసినట్లయితే ఇది ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది వేర్వేరు హాస్పిటల్స్ లో లేదా తీవ్రమైన అనారోగ్యం విషయంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.
రిస్టోరేషన్ బెనిఫిట్స్ పాలసీలలో డిఫాల్ట్ ఫీచర్‌గా మారుతోంది. మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకుంటున్నప్పుడు. అంటే మీ కుటుంబ సభ్యులందరికీ ఒకే ప్లాన్ కింద ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు ఇది తప్పనిసరిగా ఉండాలి. కానీ రిస్టోరేషన్ బెనిఫిట్స్ నిబంధన కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయడం సులభం కాదా లేదా అనేది బీమా సంస్థపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, ఆదిత్య బిర్లా హెల్త్ ప్లాటినం మెరుగైన ప్లాన్‌ను తీసుకోండి. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రిలిమినరీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని రిస్టోరేషన్ కి ఛాన్స్ ఇస్తుంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించినది అయితే తప్ప పాలసీ OPD చికిత్సలను కవర్ చేయదు అలాగే, పాలసీ కింద చేసిన మీ మొదటి క్లెయిమ్‌కు ఇన్సూరెన్స్ మొత్తం రీలోడ్ వర్తించదు. అంతేకాకుండా, మీ పాలసీ రూ. 1,00,000 బీమా మొత్తాన్ని ఆఫర్ చేస్తుందని అనుకోండి. మీరు డయాబెటిక్ లక్షణాల కారణంగా ఆసుపత్రికి చేరుకుంటారు. దాని చికిత్స కోసం రూ.1,00,000 క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు, 3 నెలల తర్వాత, మీ కుటుంబంలోని మరొక సభ్యుడు మధుమేహంతో అడ్మిట్ అయితే, వారికి రూ. 1,00,000 రీలోడ్ అవదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ రెండో వ్యక్తి ఖర్చు లక్ష రూపాయలు మీ జేబు నుంచి పెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా మీరు రీలోడ్ చేసిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఫార్వార్డ్ చేయలేరు. అంటే మీరు ఒక పాలసీ సంవత్సరంలోపు రిస్టోర్ చేసిన బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతే, తర్వాతి కాలంలో మీరు దాని నుంచి ప్రయోజనం పొందలేరు.
కొన్ని పాలసీలు కూడా పేమెంట్ ను తప్పనిసరి చేస్తాయి. అంటే ఇన్సూరెన్స్ మొత్తంతో సంబంధం లేకుండా, మీ క్లెయిమ్‌కు చెల్లించాల్సిన కంపెనీ బాధ్యత ముందుగా నిర్ణయించిన శాతానికి మాత్రమే పరిమితం అయి ఉంటుంది. మిగిలినవి మీపై ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, ఈ సహ-చెల్లింపు 25% వరకు ఉంటుంది.
ఉదాహరణకు, Niva Bupa ReAssure 2.0 హెల్త్ ఇన్సూరెన్స్ 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌లతో వస్తుంది, ఇందులో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మినహా మీ వైద్యపరమైన సమస్యలకు బీమా సంస్థ బాధ్యత వహించదు. ఈ వ్యవధి మీ ముందుగా ఉన్న వ్యాధులకు 36-48 నెలల వరకు – కంటిశుక్లం, హెర్నియా, కీళ్ల మార్పిడి అలాగే మరిన్ని వంటి కొన్ని నిర్దిష్ట పరిస్థితులకు 24 నెలల వరకు పొడిగిస్తుంది. అయితే, ఇందులో ఉన్న ఒక సానుకూల అంశం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఉపయోగించని బీమా మొత్తాన్ని తదుపరి పాలసీ సంవత్సరానికి ఫార్వార్డ్ చేయడానికి ఇది అనుమతిస్తుంది.
HDFC ఎర్గో ఆప్టిమా రిస్టోర్ హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 3 – 50 లక్షల మధ్య బీమా మొత్తాన్ని అందిస్తుంది. అయితే, అపరిమిత రిస్టోరేషన్స్ అప్షనల్ బెనిఫిట్ మాత్రమే. అలాగే, ఇది 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇప్పటికే ఉన్న వ్యాధులను కవర్ చేయడం ప్రారంభిస్తుంది. మొత్తం మీద, మీ పాలసీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచడానికి రిస్టోరేషన్ బెనిఫిట్స్ మంచి మార్గం. అయితే, మీ చికిత్స కోసం ఈ ప్రయోజనంపై మాత్రమే ఆధారపడకండి. ఈ ప్రయోజనంతో అనుబంధించిన అనేక నిబంధనలు- షరతులు ఉన్నాయి, దీని వలన మీరు దానిని పొందడం కొన్నిసార్లు అసాధ్యం కావచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి