Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Bill: మీరు క్రెడిట్‌ కార్డు బిల్లును ఇలా చెల్లిస్తున్నారా? భారీ నష్టం!

క్రెడిట్ కార్డు బిల్లులో మినిమం చెల్లింపు మాత్రమే చేస్తే నష్టం తప్పదు. ఎందుకంటే బకాయి ఉన్న మొత్తంపైనా వడ్డీ వసూలు చేస్తారు. పైగా చెల్లించాల్సిన అసలు కూడా అలాగే ఉంటుంది. బ్యాంకింగ్ నిపుణుడు అమిత్ కుమార్ తన్వర్ ఏం చెప్పారంటే.. కొత్త బిల్లుకు చెల్లించాల్సిన కనీస మొత్తం కారణంగా అధిక వడ్డీ పడుతూనే ఉంటుంది. 1 లక్ష రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత..

Credit Card Bill: మీరు క్రెడిట్‌ కార్డు బిల్లును ఇలా చెల్లిస్తున్నారా? భారీ నష్టం!
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Dec 21, 2023 | 6:11 PM

గోవింద్ మూడు నెలల క్రితం క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఐఫోన్15 ప్రోని కొన్నాడు. ఐఫోన్ స్టోర్‌లో డౌన్ పేమెంట్ చేసిన తర్వాత, అతను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి మిగిలిన బ్యాలెన్స్ చెల్లించాడు. క్రెడిట్ కార్డ్ బిల్లు ప్రతీ నెలా పదో తేదీన వస్తుంది. బకాయిపడిన మొత్తం రూ. 1 లక్ష. కనీస చెల్లింపు బకాయి 5,000 రూపాయలు. అతను గడువు తేదీకి ముందు చెల్లించిన కనీస చెల్లింపు రూ.5000. గోవింద్ తరువాత బిల్లు కూడా ఇప్పటికే రెడీ అయ్యింది. లో.. గోవింద్ ప్రస్తుతం రూ. 95,000 కు బకాయి ఉన్నాడు. ఈ మొత్తంపై నెలకు 3.6% వడ్డీ ఉంటుంది. అంటే రూ.3,420 వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా దాని మొత్తం రూ.3420 పెరిగి.. మొత్తం 98,420 అయ్యింది. నెలకు 3.6% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి 52.86% అవుతుంది. దీనిని వార్షిక శాతం రేటు అంటారు.

క్రెడిట్ కార్డు బిల్లులో మినిమం చెల్లింపు మాత్రమే చేస్తే నష్టం తప్పదు. ఎందుకంటే బకాయి ఉన్న మొత్తంపైనా వడ్డీ వసూలు చేస్తారు. పైగా చెల్లించాల్సిన అసలు కూడా అలాగే ఉంటుంది. బ్యాంకింగ్ నిపుణుడు అమిత్ కుమార్ తన్వర్ ఏం చెప్పారంటే.. కొత్త బిల్లుకు చెల్లించాల్సిన కనీస మొత్తం కారణంగా అధిక వడ్డీ పడుతూనే ఉంటుంది. 1 లక్ష రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత, మీరు చెల్లించాల్సిన కనీస చెల్లింపును చేశారనుకుందాం. అప్పుడు ఎంత బ్యాలెన్స్ మిగిలి ఉంటే, దానికి 35 రోజుల పాటు వడ్డీ జోడిస్తారు.

తరువాత బిల్లులో చెల్లించాల్సిన కనీస మొత్తం తగ్గిన తర్వాత, మీరు ఏవైనా ఇతర కొనుగోళ్లు చేస్తే, ఆ డబ్బును కూడా జోడిస్తారు. సమస్య ఏమిటంటే మీరు ఈ కొత్త వస్తువులను కొనుగోలు చేసిన తేదీ నుండి రోజుల సంఖ్య ఆధారంగా వడ్డీ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త బకాయి మొత్తం ఎంతయితే ఉంటునందో దాని ఆధారంగా కనీస బకాయి ఉంటుంది. సో.. గోవింద్ ఇలా బిల్లు కట్టడం సరికాదు. అది ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. గోవింద్ మాత్రమే కాదు, మీరు కూడా కనీస బకాయిని చెల్లిస్తే.. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

కనీస బకాయి

మీ క్రెడిట్‌ కార్డు బిల్ రూపొందించినప్పుడు.. మీరు చెల్లించడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి బకాయి మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం. మరొకటి బకాయి ఉన్న దానిలో కనీస మొత్తం.. అంటే.. మొత్తం బకాయి మొత్తంలో 5% ను చెల్లించడం. ఖాతాదారుని వద్ద డబ్బు లేనప్పుడు వారు చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. దీని ప్రయోజనాలు పరిమితం. కానీ భారీ ప్రభావం ఉంటుంది. గోవింద్ విషయంలో మీరు చూశారుగా.. క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పెరుగుతుందో…!

బకాయి మొత్తాన్ని చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు

కనీస బకాయి మొత్తాన్ని చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం. మీరు మీ క్రెడిట్‌ని యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. అంటే మీరు కార్డ్‌ని ఉపయోగించుకుంటూనే.. అందులో మిగిలి ఉన్న క్రెడిట్ మొత్తాన్ని వాడుకోవచ్చు. రెండో ప్రయోజనం ఏమిటంటే.. మీరు మీ చెల్లింపు విషయంలో డిఫాల్ట్ చేయలేరు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను సురక్షితంగా ఉంచుతుంది. మరొక ప్రయోజనం ఏమిటంటే, ఆలస్య చెల్లింపు రుసుము నుండి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు.

నష్టాలు..

ఇక నష్టాల గురించి చెప్పాలంటే, అధిక-వడ్డీ రేటు చెల్లించాలి. బకాయి మొత్తంలో పెద్దగా తగ్గింపు ఉండదు. అధిక బకాయి వల్ల క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. పెద్ద షాపింగ్ చేసుకోవాలనుకున్నా.. మీరు క్రెడిట్ కార్డ్ పై ఉండే నిజమైన ప్రయోజనాలను పొందలేరు. వేర్వేరు క్రెడిట్ కార్డ్‌లలో వేర్వేరు వడ్డీ రేట్లు ఉండవచ్చు. చాలా కార్డ్‌లలో నెలవారీ వడ్డీ రేటు 3.4% నుండి 3.8% మధ్య ఉంటుంది. వార్షిక రేటు 42% నుండి 52-53% మధ్య ఉంటుంది. ఉదాహరణకు.. Axis Bank Ace క్రెడిట్‌ కార్డు నెలవారీ వడ్డీ రేటు 3.6%. దీని వార్షిక రేటు 52.86%. అయితే HDFC మిలీనియా క్రెడిట్ కార్డ్‌లో, ఇవి 3.6 %, 43.2%. అందుకే కనీస బకాయి మొత్తాన్ని చెల్లించాలి అనుకుంటే.. వడ్డీ రేటును గుర్తుంచుకోండి. ఇది మీ క్రెడిట్ కార్డ్ ని మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో మీకు సహాయపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి