Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uber Cabs: ఉబెర్ సరికొత్త ఫీచర్.. లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే వారికి బెస్ట్.. పూర్తి వివరాలు

ఉబెర్ సంస్థ మరో అడుగు ముందుకేసి అవుట్ స్టేషన్ సర్వీస్ ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఐదు రోజుల వరకూ ట్రిప్ ను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఉబెర్ ఇంటర్ సిటీ సర్వీస్ ను ప్రారంభించింది. ఇది సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఉపకరిస్తుందని పేర్కొంది. ఒకే కారు, ఒకే డ్రైవర్ సాయంతో ఐదు రోజుల వరకూ ప్రయాణాలను బుక్ చేసుకునే వీలుంటుంది.

Uber Cabs: ఉబెర్ సరికొత్త ఫీచర్.. లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే వారికి బెస్ట్.. పూర్తి వివరాలు
Uber Cab
Follow us
Madhu

| Edited By: TV9 Telugu

Updated on: Dec 20, 2023 | 6:19 PM

సమాజం కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. అన్ని రంగాల్లో విశేషమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో రవాణా సాధనాలు ఒకటి. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సో లేదా రైలు బండో ఆధారం. అక్కడక్కడా మాత్రమే కార్లు కనిపించేవి. ఇప్పుడు లోకం మారిపోయింది. రకరకాల రవాణా సాధానాలు మనకు కనిపిస్తున్నాయి. వాటిల్లో క్యాబ్ వ్యవస్థ ఒకటి. ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి. వినియోగదారులకు అనువైన సౌకర్యాలను అందిస్తూ ఇవి రాణిస్తున్నాయి. పిక్ అండ్ డ్రాప్, రౌండ్ ట్రిప్, అవుట్ స్టేషన్, రెంటల్స్ వంటి ఆప్షన్లు మనకు ఆయా సంస్థల యాప్స్ లో మనకు కనిపిస్తాయి. కాగా ఉబెర్ సంస్థ మరో అడుగు ముందుకేసి అవుట్ స్టేషన్ సర్వీస్ ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఐదు రోజుల వరకూ ట్రిప్ ను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఉబెర్ ఇంటర్ సిటీ సర్వీస్ ను ప్రారంభించింది. ఇది సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఉపకరిస్తుందని పేర్కొంది. ఒకే కారు, ఒకే డ్రైవర్ సాయంతో ఐదు రోజుల వరకూ ప్రయాణాలను బుక్ చేసుకునే వీలుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి..

ఉబెర్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ప్రస్తుతం ఉబెర్ పనిచేస్తున్న అన్ని నగరాల్లోనూ విస్తరించింది. వినియోగదారుల వ్యాపారం, వారి విశ్రాంతి సమయం, ప్రయాణాలు అన్ని బేరీజు వేసుకొని అవుట్ స్టేషన్ రౌండ్ ట్రిప్ ను బుక్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది. ఈ ఫీచర్ మెరుగైన ఫ్లెక్సిబిలిటీని అందజేస్తుంది. ఒకే కారు, ఒకే డ్రైవర్ ఉంటాడు కాబట్టి ప్రయాణికులు అవసరమైన విధంగా స్టాప్‌లను జోడించడానికి వీలు కల్పిస్తుంది.

ప్రీ బుక్ చేసుకోవచ్చు..

ఉబెర్ తన ప్రయాణికులను 90 రోజుల ముందుగానే రైడ్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అందుకోసం యాప్ లో ప్రత్యేకమైన ఆప్షన్ ను అందించింది. ముందుగా ప్లాన్ చేసిన అవుట్‌స్టేషన్ ప్రయాణానికి మెరుగైన ప్రయాణ ప్రణాళికను అందిస్తుంది. ఈ ఫీచర్‌ని చేర్చడం వల్ల డ్రైవర్‌లకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. అధిక ఆదాయాలను పొందేందుకు, వారి షెడ్యూల్‌లను ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశాన్ని వారికి అందిస్తుంది. అంతేకాక ఈ ఫీచర్ తో డ్రైవర్లకు కూడా పూర్తి న్యాయం జరిగేలా టారిఫ్ లను పెట్టింది. ఈ రౌండ్ ట్రిప్‌ల ఛార్జీలలో వెయింటింగ్ సమయం, ఎక్కువ రోజుల పర్యటనల కోసం రాత్రిపూట బస రుసుములు ఉంటాయి. డ్రైవర్ల సమయం, కృషికి న్యాయమైన పరిహారం అందేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అన్ని భద్రతా ఫీచర్లతో..

ఉబెర్ న్యూ మొబిలిటీ హెడ్ శ్వేతా మంత్రి ఈ వినూత్న ఫీచర్ గురించి మాట్లాడుతూ.. ఇంటర్‌సిటీ రౌండ్ ట్రిప్‌లు ఎక్కువ రోజులు క్యాబ్, అదనపు సౌకర్యాన్ని కోరుకునే ప్రయాణికులకు సరిగ్గా సరిపోతుందన్నారు. ముఖ్యంగా సుదూర రహదారి ప్రయాణం చేసే వారికి ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్వచించాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చామన్నారు. అలాగే అన్ని ఉబెర్ రైడ్‌లలో అందుబాటులో ఉన్న భద్రతా ట్రాకింగ్ ఫీచర్‌లను చేర్చామని వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..