Service Charge Rules: రెస్టారెంట్ లో తప్పనిసరిగా సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిందేనా? అసలు రూల్ ఏమిటి?
సర్వీస్ ఛార్జ్ తీసుకోవడం చట్టవిరుద్ధం కాదు. కానీ.. అది ఇవ్వలా వద్దా అన్నది కస్టమర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అంటే కస్టమర్ అది పే చేయాలి అనుకుంటే చేయవచ్చు.. వద్దు అనుకుంటే చేయాల్సిన అవసరం లేదు. నోయిడా ఘటనపై స్పందించిన వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్.. ఆ రెస్టారెంట్‌కు నోటీసు జారీ చేశారు.
ఈ మధ్య కాలంలో నోయిడాలోని ఒక రెస్టారెంట్‌లో పెద్ద గొడవ అయింది. కస్టమర్లు.. రెస్టారెంట్ సిబ్బంది గట్టిగా కొట్టుకున్నారు. సర్వీస్ ఛార్జీ విషయంలో కస్టమర్ హక్కుల గురించి ఈ రచ్చ జరిగింది. ఇదేదో కస్టమర్ల తప్పు అని అనుకోకండి. కావాలని గొడవ చేశారనీ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆ రెస్టారెంట్‌లో డిన్నర్‌కి వెళ్లాడు. అక్కడ బిల్లులో జీఎస్టీతో పాటు రూ. 970ల సర్వీస్ చార్జ్ వేశారు. దాన్ని తీసేయాలని ఆ కస్టమర్ డిమాండ్ చేశాడు. దీంతో ఒకరితో ఒకరికి మాటామాటా పెరిగి కొట్టుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. ఇంతకీ.. సర్వీస్ చార్జ్ రెస్టారెంట్ వసూలు చేయడం కరెక్టేనా? ఈ విషయంలో అసలు రూల్స్ ఏంటో తెలుసుకుందాం..
సర్వీస్ ఛార్జ్ తీసుకోవడం చట్టవిరుద్ధం కాదు. కానీ.. అది ఇవ్వలా వద్దా అన్నది కస్టమర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అంటే కస్టమర్ అది పే చేయాలి అనుకుంటే చేయవచ్చు.. వద్దు అనుకుంటే చేయాల్సిన అవసరం లేదు. నోయిడా ఘటనపై స్పందించిన వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్.. ఆ రెస్టారెంట్‌కు నోటీసు జారీ చేశారు. సర్వీస్ ఛార్జ్ అనేది కస్టమర్ విచక్షణతో కూడిన ఛార్జీ అని స్పష్టం చేశారు. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) – ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI)కి జారీ చేసిన ఈ నోటీసులో సర్వీస్ చార్జ్‌ను కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేయకూడదని స్పష్టంచేశారు. ప్రత్యేకించి కస్టమర్ రెస్టారెంట్ సర్వీస్‌తో సంతృప్తి చెందక సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని డిమాండ్ చేయకూడదని పేర్కొన్నారు.
ఇక ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడా గతంలో ఇదే తరహా ఆదేశాలిచ్చింది. గతేడాది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సర్వీస్ ఛార్జీ విషయంలో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఏ హోటల్ లేదా రెస్టారెంట్ ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా ఫుడ్ బిల్లుకు సర్వీస్ ఛార్జీని విధించకూడదని ఆ మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. అలాగే మరే ఇతర ఛార్జీల పేరుతో సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకూడదని స్పష్టంచేసింది. ఈ మార్గదర్శకాలను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా.. ఢిల్లీ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ మార్గదర్శకాలపై స్టే విధించింది. రెస్టారెంట్లు ఈ ఆర్డర్‌ను తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టాయి. వాస్తవానికి సర్వీస్ ఛార్జీని కస్టమర్ తప్పనిసరిగా చెల్లించాలని మాత్రం హైకోర్టు చెప్పలేదు. హైకోర్టు తీర్పు సర్ ఛార్జీలను తప్పనిసరి చేసినట్లు కాదు.
చాలా రెస్టారెంట్లు ఢిల్లీ హైకోర్టు ఆర్డర్‌ను మెనూ లేదా డిస్ప్లే బోర్డ్‌లో ప్రదర్శిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ చెల్లించడం తప్పనిసరి అని చూపిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో తన స్టాండ్‌ను స్పష్టం చేసింది. వినియోగదారుని తప్పుదారి పట్టించే విధంగా – సర్వీస్ ఛార్జీ విధించడాన్ని కోర్టు ఆమోదించిందని భావించే విధంగా తన ఆర్డర్‌ను ప్రదర్శించకూడదని పేర్కొంది.
సర్వీస్ ఛార్జీని తీసేయాలని కస్టమర్ అడిగితే, కచ్చితంగా సర్వీస్ ఛార్జీ పే చేయాల్సిందే అని రెస్టారెంట్ పట్టుబట్టకూడదని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ తమ తాజా నోటీసులో తెలిపారు.
ఇది ఒక్క నోయిడాకి సంబంధించిన విషయమే కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాగే జరుగుతోంది. మనం ఒక్కోసారి రెస్టారెంట్ కు వెళ్ళి.. అక్కడ ఫుడ్ తీసుకున్నాక.. రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీ విధించింది అనుకుందాం. మనకి అక్కడి సర్వీస్ నచ్చకపోయినా.. సర్వీస్ ఛార్జీ ఎక్కువ అని భావించినా.. వాళ్ళతో గొడవ ఎందుకులే అని లేదా మొహమాటంతోనో పేమెంట్ చేసేస్తాం. ఒకవేళ అలా అక్కడ గొడవ పడకూడదు అనుకుంటే సర్వీస్ ఛార్జీ పే చేసిన తరువాత మనం దీనిపై వినియోగదారుల వ్యవహారాల శాఖ వద్ద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది.
రెస్టారెంట్‌లో గొడవపడటం సరికాదు. కానీ మన హక్కుల కోసం పోరాడటం కూడా తప్పు కాదు. మనం అక్కడి ఫుడ్ – సర్వీస్ ను ఇష్టపడితే, అప్పుడు మాత్రమే మనం సర్వీస్ ఛార్జీని పే చేయగలమని కచ్చితంగా వారికి చెప్పవచ్చు. వారి మెనూలో లేదా డిస్ప్లే బోర్డ్‌లో సర్వీస్ ఛార్జ్ గురించి తప్పుగా కోర్టు ఆర్డర్ ఉంటే, దాని గురించి ముందుగా మాట్లాడాలి. ఓ కస్టమర్‌గా మీరు మీ హక్కులపై రాజీ పడాల్సిన అవసరం లేదు. అలాగే మీ కుటుంబం.. స్నేహితులతో హాయిగా ప్రశాంతంగా ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు.
దగ్గులో తేడాలను స్మార్ట్ ఫోన్‌లో విని వ్యాధి స్థాయిని అంచనా వేసే విధానాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొవిడ్ కారణంగా బార్సిలోనాలోని డెల్‌మార్ ఆసుపత్రిలో చేరిన 70 మంది రోగుల దగ్గును తొలి 24 గంటల్లోనే స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేశారు. వాటి హెచ్చు తగ్గులను బట్టి వ్యాధి తీవ్రతను విశ్లేషించే విధానాన్ని, అల్గొరిథమ్స్‌ను రూపొందించారు. దీనివల్ల వ్యాధిని ఆరంభ దశలోనే కనిపెట్టడంతో పాటు దూర ప్రాంతాల్లోని రోగులకు రిమోట్ చికిత్స చేయడమూ సాధ్యపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ, వైద్య వసతులు లేని ప్రాంతాల్లోనూ దూరం నుంచి చికిత్సకు తోడ్పడే విధానమిది. దీన్ని ఇతర శ్వాసకోశ వ్యాధుల చికిత్సకూ ఉపయోగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..