EV Scooters: ఈవీ స్కూటర్స్‌తో వారెవ్వా అనిపించిన వారివో.. ఒకేసారి ఆరు స్కూటర్ల రిలీజ్
భారతదేశంలో నిత్యం ఏదో రాష్ట్రంలో కొత్త స్టార్టప్ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడంతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తామంటూ హామీనిస్తున్నాయి. తాజాగా వారివో మోటర్స్ ఇండియా ఈవీ స్కూటర్లను రిలీజ్ చేయడంతో రికార్డును సృష్టించింది.

భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన వారివో మోటార్స్ ఇండియా నోవా, ఎడ్జ్ అనే రెండు సిరీస్‌లలో ఆరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వారివో ఇప్పటికే సీఆర్ఎక్స్, జెడ్‌బీ, ఎల్-1 ప్లస్, ఎల్-2, నెక్సా డీఎస్ వంటి వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా సేవలను అందిస్తుంది. రూ.44,999 ధరతో ప్రారంభమయ్యే ఈ కొత్త స్కూటర్లు పట్టణ ప్రాంత ప్రజలతో పాటు విద్యార్థులను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేశారు. అలాగే తక్కువ దూరం ప్రయాణించే డెలివరీ రైడర్లకు ఈ స్కూటర్లు అనువుగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్లను ఓ సారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వరకు మైలేజ్ అందిస్తామని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. స్మార్ట్ యాప్-ఎనేబుల్డ్ కనెక్టివిటీ, 3 సంవత్సరాల సమగ్ర వారంటీతో ఈ స్కూటర్లు కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తాయని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
కొత్త నోవా సిరీస్ వారివో మోటార్స్‌కు సంబంధించిన అగ్రశ్రేణి వెర్షన్‌గా నిలిచింది. నోవా, నోవా ఎక్స్, నోవా ఎస్ అనే మూడు ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే అన్ని ఈవీ స్కూటర్లు ఓ సారి చార్జ్ చేస్తే 120 కి.మీ వరకు మైలేజ్‌తో పాటు మూడు సంవత్సరాల వారంటీ వస్తుంది. ఎంట్రీ లెవల్ నోవా ధర రూ. 55,999, నోవాఎక్స్ ధర రూ. 59,999, నోవాఎస్ ధర రూ. 64,999. ఈ మూడు ఈ -స్కూటర్లు ఎల్ఈడీ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిస్క్, డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌తో వస్తాయి.
అలాగే మరో సిరీస్ రెండు ట్రిమ్‌లలో ఎడ్జ్, ఎడ్జ్+ లభిస్తుంది. ఎడ్జ్ ధర రూ.44,999గా ఉండే ఎడ్జ్ ప్లస్ ధర రూ.49,999గా ఉంది. ఎడ్జ్ అనేది నో-ఫ్రిల్ వర్క్‌హార్స్ లైనప్, 195 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 800 మిమీ సీట్ హైట్‌తో వస్తుంది. ఎడ్జ్ ప్లస్ 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 760 మిమీ సీట్ హైట్‌తో కొంచెం సులభంగా అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ ట్రిమ్‌లా కాకుండా ఇది ఇండికేటర్‌లతో సహా అన్ని ఎల్ఈడీ లైట్లతో వస్తుంది. అలాగే మరో స్కూటర్ నియో ఈ లైనప్‌లో అత్యంత సరసమైన ఈవీ స్కూటర్‌గా నిలిచింది. ఈ స్కూటర్ ధర రూ. 39,999. ఈ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 142 మిమీ, సీట్ ఎత్తు 740 మిమీగా ఉంది. బేసిక్, బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూటర్ కావడంతో దీనికి బల్బ్ టెయిల్ లాంప్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








