AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold investments: దీపావళి వేళ బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? ది బెస్ట్ ప్లాన్స్ ఇవే..!

పెద్దల నుంచి పిల్లల వరకూ అందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి వచ్చేస్తోంది. పండగ సందర్బంగా ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తున్నారు. మార్కెట్ లోని షాపులన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. దీపావళి సందర్బంగా కొత్త వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కార్లు, బైక్ లు, ఫ్రిడ్జిలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను తీసుకు రావడానికి ఇదే మంచి సమయమని భావిస్తారు.

Gold investments: దీపావళి వేళ బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? ది బెస్ట్ ప్లాన్స్ ఇవే..!
Gold Investment
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 26, 2024 | 4:57 PM

Share

దీపావళి సందర్భంగా బంగారాన్ని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీనివల్ల ఇంటికి మహాలక్ష్మి వస్తుందని భారతీయుల నమ్మకం. సాధారణంగా బంగారాన్ని ఆభరణాల రూపంలో దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు. అయితే మరికొన్ని విధానాల్లో కూడా దానిలో పెట్టుబడి పెట్టవచ్చు. దీపావళి సమయంలోనే కాకుండా మిగిలిన రోజుల్లో కూాడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బంగారంలో పెట్టుబడి పెట్టే చాలా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ)

సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ విడుదల చేస్తుంది. ఐదేళ్ల లాక్ పిరియడ్ తో ఎనిమిదేళ్ల వరకూ ఉంటాయి. లాక్ పిరియడ్ ముగిసిన తర్వాత బాండ్లను రీడిమ్ చేసుకోవచ్చు. ఈ విధానంలో మన దగ్గర భౌతికంగా కాకుండా బాండ్ల రూపంలో బంగారం ఉంటుంది. అయితే అన్ని వేళలా ఇవి అందుబాటులో ఉండవు. ఏడాడికి ఒకటి లేదా రెండుసార్లు ఎస్జీబీ విక్రయాలు జరుగుతాయి. వాటికి సంబంధించిన విండో విడుదల చేసినప్పుడు కొనుగోలు చేసుకోవాలి.

డిజిటల్ బంగారం

బంగారంపై పెట్టుబడి పెట్టడానికి డిజిటల్ గోల్డ్ విధానం కూడా అందుబాటులో ఉంది. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే తదితర ఆన్ లైన్ ప్లాట్ ఫాంల ద్వారా కస్టమర్లు బంగారాన్నికొనుగోలు చేయవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు సరిపడే బంగారాన్ని మీపేరు మీద నిల్వ చేస్తారు. ఆ బంగారం పరిమాణం అప్పటి ధర మీద ఆధారపడి ఉంటుంది. అతి తక్కువ పెట్టుబడితో కూాడా బంగారాన్ని కొనుగోలు చేసుకోవడానికి దీనిలో అవకాశం ఉంటుంది. మీకు డబ్బులు అవసరమైనప్పుడు బంగారాన్ని నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బంగారం నాణేలు

బంగారం నాణేలను కొనుగోలు చేయడం కూడా మరో మంచి పద్దతి. వీటిని బీఐఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా హాల్ మార్క్ చేస్తారు. అంటే స్వచ్ఛమైన బంగారంతో వీటిని తయారు చేస్తారు. మార్కెట్ లో 0.5 గ్రాముల నుంచి 50 గ్రాముల బంగారం నాణేలు అందుబాటులో ఉన్నాయి. బంగారం దుకాణాల వ్యాపారులు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఇ కామర్స్ వెబ్ సైట్లలో బంగారం నాణేలను విక్రయిస్తారు.

గోల్డ్ ఈటీఎఫ్

ఇది ఒక మ్యూచువల్ ఫండ్ పథకం. పెట్టుబడిదారుల నుంచి సేకరించిన సొమ్ములను బంగారంపై పెట్టుబడులు పెడుతుంది. వీటిని ఎక్స్చేంచ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అంటారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇవి కంపెనీల షేర్ల మాదిరిగానే స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిని ఎప్పుడైనా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు.

బంగారు పొదుపు పథకం

ప్రస్తుతం చాలా బంగారు దుకాణాల్లో బంగారం పొదుపు పథకాలు అమలవుతున్నాయి. వీటిలో మీరు ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయాలి. ఆ మొత్తానికి సరిపడే బంగారాన్ని మీ పేరు మీద కేటాయిస్తారు. నిర్ణీత సమయంలో ముగిసిన తర్వాత మీరు కట్టిన సొమ్ములకు అనుగుణంగా బంగారు ఆభరణాలను తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి