AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras: ధనత్రయోదశి రోజున బంగారం కొనాల్సిందేనా..? వెండి, బంగారాల్లో మీ చాయిస్ ఏంటి?

దీపావళి సందర్బంగా బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి భారతీయులు ఇష్టపడతారు. ఈ పండగ సమయంలో వీటిని కొనడం మంచిదని భావిస్తున్నారు. మన పూర్వీకుల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. దీపావళి సమయంలో వచ్చే ధన్ తేరాస్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ధన త్రయోదశి అంటే ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేద దేవుడు ధ్వనంతరి ఈ భూమిపై ఆవిర్భవించిన రోజు. ఆ రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల శ్రేయస్సు, సంపద, అదృష్టం లభిస్తాయని నమ్మకం.

Dhanteras: ధనత్రయోదశి రోజున బంగారం కొనాల్సిందేనా..? వెండి, బంగారాల్లో మీ చాయిస్ ఏంటి?
Gold Price Today
Nikhil
|

Updated on: Oct 26, 2024 | 5:18 PM

Share

ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండిలో దేనిని కొనుగోలు చేయాలనే విషయంలో కొంత సందేహం తలెత్తుతుంది. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. ఈ రెండు లోహాలు వేటికవే ప్రత్యేకమైనవి. ముఖ్యంగా దీపావళి పండుగకు ముందు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీ పూజ చేసుకోవడం ఎన్నో ఏళ్ల ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. బంగారానికి స్థిరత్వం ఎక్కువ, అలాగే సాంస్కృతిక నేపథ్యం కూడా ఉంది. తర్వాత స్థానంలో వెండికి డిమాండ్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోలు విషయంలో ఏది బెస్ట్? అనేది ఓ సారి తెలుసుకుందాం.

బంగారం

  • భారతీయులందరూ ఎంతో ఇష్టపడే లోహం బంగారం. పూర్వకాలం నుంచి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. బంగారం కలిగి ఉండటాన్ని స్టేటస్ కు చిహ్నంలా భావిస్తారు. ముఖ్యంగా పండుగల, శుభకార్యాలు, ఇతర ముఖ్య మైన రోజుల్లో బంగారు ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే బంగారం లేకుండా పండగలు, శుభకార్యాలు జరగవు.
  • బంగారం విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. దీనిలో పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షిత మార్గం. ముఖ్యంగా మహిళలు తమ పొదుపును బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులను అత్యంత మేలైన విధానంగా ప్రజలు భావిస్తున్నారు.
  • బంగారంపై పెట్టబడులు పెట్టడం చాలా సులభం. దుకాణాల్లో ఆభరణాలు, నాణేలుగా కొనుగోలు చేయవచ్చు. లేకపోతే ఈటీఎఫ్ (మ్యూచువల్ ఫండ్స్)లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలో కొనుగోలు జరపవచ్చు.
  • ఆర్థిక మాంద్యం సమయంలోనూ బంగారం ధరలకు ఇబ్బంది ఉండదు. అత్యవసర సమయంలో బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
  • బంగారు ఆభరణాలకు ఎంతో విలువ ఉంటుంది. వీటిని ధరించడం వల్ల అందం పెరుగుతుందని భావిస్తారు. అలాగే వీటి వినియోగం కూడా మన సంప్రదాయంలో చాలా ముఖ్యం.

వెండి

  • బంగారం తర్వాత ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే లోహం వెండి. దీని ధర బంగారంతో పోల్చితే తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ వెండిని కొనుగోలు చేసుకోవచ్చు.
  • వెండిపై ధర పెరుగుదల బంగారంతో పోల్చితే తక్కువగానే ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఈ విషయంలో బంగారం ఆదిపత్యం. అయితే బుల్ మార్కెట్‌లలో వెండి చాలా వేగంగా పెరుగుతోంది.
  • వెండితో తయారు చేసిన ఆభరణాలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. దీని మెరిసే రూపం ఎంతో ఆకట్టకుంటుంది. మంచి నాణ్యమైన, అందమైన డిజైన్లలో వెండి ఆభరణాలు ఆకట్టుకుంటున్నాయి.
  • కొన్ని పండుగల సమయంలో వెండిని తప్పనిసరిగా ధరిస్తారు. ఈ ఆచారం సంప్రదాయంగా వస్తోంది. బంగారం మాదిరిగానే ధన్‌తేరాస్‌లో వెండిని కొనుగోలు చేయడం వల్ల జీవితం చక్కగా సాగుతుందని నమ్మికం.

ఏది మంచిదంటే..?

సాధారణంగా బంగారం కొనుగోలుకే ప్రజలందరూ మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గాలలో బంగారం ముందు వరుసలో ఉంటుంది. అయినప్పటికి వెండిని కొనుగోలు చేయడం కూడా మంచిదే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి