VandeBharat: అలాంటి వాళ్లు మాత్రమే వందే భారత్‌లో ప్రయాణించండి! ప్రజలకు ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్ మేనేజర్ వార్నింగ్
వందే భారత్ స్లీపర్ రైళ్లలో టాయిలెట్ల వినియోగం, ప్రజా ఆస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్ మేనేజర్ అనంత్ రూపనగుడి ప్రయాణీకులను హెచ్చరించారు. సరైన ఫ్లషింగ్ లేకపోవడం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. అలాగే ఇంకేమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ రైల్వేస్‌లో వందే భారత్ రైళ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటిని కొత్త తరం రైళ్లుగా అంతా భావిస్తుంటారు. ఇక కొత్తగా వచ్చిన వందే భారత్ స్లీపర్ అయితే ఇంకా నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. అలాంటి వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్ మేనేజర్ అనంత్ రూపనగుడి వార్నింగ్ ఇచ్చారు. టాయిలెట్ వినియోగం, ప్రజా ఆస్తులను గౌరవించే ప్రయాణీకులు మాత్రమే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని అన్నారు.
ఆందోళన ఏమిటంటే చాలా మంది ప్రయాణీకులు టాయిలెట్లను ఫ్లష్ చేయరు లేదా అది పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేయరు అని ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైలు అధికారికంగా ప్రారంభించబడటానికి ముందే, వేగం లేదా ఆన్‌బోర్డ్ సౌకర్యాల కంటే ప్రయాణీకుల ప్రవర్తన, పరిశుభ్రత గురించి చర్చలు మొదలయ్యాయి. 2AC, 3AC వంటి ఇతర ప్రీమియం కోచ్‌లలో కూడా పనిచేసే ఫ్లష్ వ్యవస్థలు, నీరు, టిష్యూలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కొన్నిసార్లు తక్కువగా ఉన్నాయని అనేక మంది ఎత్తి చూపారు.
విమర్శలకు రైల్వే ప్రతిస్పందన
ప్రీమియం సర్వీసులలో ఇటువంటి సమస్యలు చాలా అరుదు అని రూపనగుడి స్పష్టం చేశారు. సిబ్బంది చెత్తను ట్రాక్‌లపై వేస్తున్నట్లు చూపించే వాదనలను ఆయన తోసిపుచ్చారు, ఎంపిక చేసిన లేదా పాత వీడియోలు ప్రస్తుత వాస్తవికతను ప్రతిబింబించవని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలతో, పరిశుభ్రత నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు.
Please travel in it only if you have learnt your toilet manners, will obey the instructions given in the washrooms, and have respect for public property. Thanks! #IndianRailways #VandeBharat https://t.co/mnnm153clQ
— Ananth Rupanagudi (@Ananth_IRAS) January 12, 2026
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
