AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup 2026: ఆస్ట్రేలియాకు పాత బాకీ తీర్చే టైమ్ వచ్చేసింది..అమెరికాను ఊచకోత కోసేందుకు మన కుర్రాళ్లు రెడీ!

U19 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో తదుపరి సూపర్ స్టార్లను పరిచయం చేసే అండర్-19 వరల్డ్ కప్ 2026 సందడి మొదలైపోయింది. జింబాబ్వే, నమీబియా వేదికలుగా రేపటి నుంచే (జనవరి 15) ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్ పోరుతో ఈ టోర్నీ ముగుస్తుంది.

U19 World Cup 2026: ఆస్ట్రేలియాకు పాత బాకీ తీర్చే టైమ్ వచ్చేసింది..అమెరికాను ఊచకోత కోసేందుకు మన కుర్రాళ్లు రెడీ!
U19 World Cup 2026
Rakesh
|

Updated on: Jan 14, 2026 | 8:55 AM

Share

U19 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో తదుపరి సూపర్ స్టార్లను పరిచయం చేసే అండర్-19 వరల్డ్ కప్ 2026 సందడి మొదలైపోయింది. జింబాబ్వే, నమీబియా వేదికలుగా రేపటి నుంచే (జనవరి 15) ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్ పోరుతో ఈ టోర్నీ ముగుస్తుంది. మొత్తం 16 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా, ఈసారి ఎలాగైనా ఆరోసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.

భారత జట్టు గ్రూప్-Aలో చోటు దక్కించుకుంది. భారత్తో పాటు యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఈ గ్రూపులో ఉన్నాయి. టోర్నీ ఆరంభ రోజైన జనవరి 15నే భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. తొలి పోరులో అమెరికాతో తలపడనుంది. జింబాబ్వేలోని బులవాయో వేదికగా మధ్యాహ్నం 1 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

ఈసారి భారత జట్టులో అత్యంత ఆకర్షణీయమైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. అతి చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్‌లో రికార్డులు సృష్టించిన ఈ యువ సంచలనంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా అదరగొట్టిన వైభవ్, వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రధాన బలం కానున్నాడు. ఆయూష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ యువ జట్టులో కిషన్ కుమార్ సింగ్, మహ్మద్ ఏనాన్ వంటి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. గతేడాది ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గ్రూపుల వివరాలు ఇలా ఉన్నాయి

గ్రూప్ A: భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, USA.

గ్రూప్ B: పాకిస్థాన్, ఇంగ్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్.

గ్రూప్ C: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జపాన్.

గ్రూప్ D: సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, టాంజానియా.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
మండె ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మండె ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సీఎంగా విజయ్‌.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే ఎమ్మెల్యేలు వీరే!
సీఎంగా విజయ్‌.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే ఎమ్మెల్యేలు వీరే!
లాభాల పంట పండించిన పెన్నీ స్టాక్స్‌!
లాభాల పంట పండించిన పెన్నీ స్టాక్స్‌!
చిటికెలో రక్తాన్నిపెంచే కొబ్బరి, బీట్ రూట్ పచ్చడి..
చిటికెలో రక్తాన్నిపెంచే కొబ్బరి, బీట్ రూట్ పచ్చడి..
స్టాక్‌ మార్కెట్‌ నుంచి సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌!
స్టాక్‌ మార్కెట్‌ నుంచి సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌!
దినఫలాలు (10 మే 2026): ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.
దినఫలాలు (10 మే 2026): ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.
హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్..
హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
ఆ రోగాలకు దివ్యాస్త్రం.. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఇక తిరుగుండదు..
ఆ రోగాలకు దివ్యాస్త్రం.. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఇక తిరుగుండదు..
నార్త్ టు ఈస్ట్.. మిషన్ కంప్లీటెడ్! హైదరాబాద్‌లో మోదీ టూర్..
నార్త్ టు ఈస్ట్.. మిషన్ కంప్లీటెడ్! హైదరాబాద్‌లో మోదీ టూర్..