Swiggy: హోళీ వేళ స్విగ్గీ అత్యుత్సాహం.. యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్న యూజర్లు. అసలేం జరిగిందంటే..

కొన్ని సంస్థల ప్రకటనలు అప్పుడప్పుడు లేనిపోని వివాదాలకు దారి తీస్తుంటాయి. తాము క్రియేటివీ అనుకుంటారు కానీ ఇతరుల మనోభావాల గురించి ఆలోచించరు. ఇలా ఏదో అనుకొని ఇంకోదే జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది ప్రముఖ ఫుడ్‌...

Swiggy: హోళీ వేళ స్విగ్గీ అత్యుత్సాహం.. యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్న యూజర్లు. అసలేం జరిగిందంటే..
Swiggy
Follow us

|

Updated on: Mar 07, 2023 | 5:36 PM

కొన్ని సంస్థల ప్రకటనలు అప్పుడప్పుడు లేనిపోని వివాదాలకు దారి తీస్తుంటాయి. తాము క్రియేటివీ అనుకుంటారు కానీ ఇతరుల మనోభావాల గురించి ఆలోచించరు. ఇలా ఏదో అనుకొని ఇంకోదే జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ. హోళీ పండుగ సందర్భంగా స్విగ్గీ విడుదల చేసిన ఓ ప్రకటన యూజర్లను ఆగ్రహానికి కారణంగా మారింది. దీంతో యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ స్విగ్గీ చేసిన ఆ ప్రకటన ఏంటి.? అది మనోభావాలను దెబ్బ తీయడానికి ఎలా కారణమైందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

తాజాగా హోళీ పర్వదినం సందర్భంగా స్విగ్గీ ఒక హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో హాళీ పండుగకు అవసరమయ్యే వస్తువులను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ద్వారా కొనుగోలు చేసుకోండి అని పేర్కొంది. స్విగ్గీలో కోడి గుడ్లను కొనుగోలు చేయండి అని హోర్డింగ్‌పై రాసుకొచ్చారు. అయితే ‘కోడిగుడ్లు అమ్లెట్‌ చేసుకోవడానికే ఇతరుల తలపై కొట్టడానికి కాదని’ ఉన్న వ్యాఖ్యలు రచ్చకు కారణమయ్యాయి. అంతటితో ఆగకుండా ‘బురా మత్‌ కేలో’ (చెడుగా ఆడకండి) అనే హాష్‌ ట్యాగ్‌ను సైతం రాసుకొచ్చారు.

దీంతో ఈ అంశం చర్చకు దారి తీసింది. స్విగ్గీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించింది అంటూ యూజర్లు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీ వెంటనే సదరు ప్రకటనను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘హిందుఫోబిక్‌స్విగ్గీ’ అనే హాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌లు చేస్తున్నారు. మరి ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..