Remittance: ఆ విషయంలో గల్ఫ్ దేశాలను అధిగమించిన అమెరికా.. భారత్‌‌పై ప్రభావం పడేనా..?

|

Jul 21, 2022 | 9:21 PM

గతంలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులు భారత్‌కు ఎక్కువ డబ్బు పంపేవారు. 2016-17 మధ్య కాలంలో భారతదేశానికి పంపిన రెమిటెన్స్‌ (విదేశీ కరెన్సీ) లలో 50 శాతం గల్ఫ్ దేశాల నుంచి వచ్చాయి.

Remittance: ఆ విషయంలో గల్ఫ్ దేశాలను అధిగమించిన అమెరికా.. భారత్‌‌పై ప్రభావం పడేనా..?
Remittance
Follow us on

US overtakes UAE as India’s top remittance: అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిమాణాలతో విదేశాల్లో ఉంటున్న భారతీయులు భారత్‌కు డబ్బు పంపే విధానంలో మార్పు వచ్చింది. గతంలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులు భారత్‌కు ఎక్కువ డబ్బు పంపేవారు. 2016-17 మధ్య కాలంలో భారతదేశానికి పంపిన రెమిటెన్స్‌ (విదేశీ కరెన్సీ) లలో 50 శాతం గల్ఫ్ దేశాల నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు మొత్తం రెమిటెన్స్‌ (విదేశాల్లో ఉన్న వారు కుటుంబాలకు పంపే నగదు) లో గల్ఫ్ దేశాల వాటా 30 శాతానికి తగ్గింది. ఎందుకంటే అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌కు రెమిటెన్స్‌ ఎక్కువగా వస్తోంది. పతనం కొనసాగుతోన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలోని చెల్లింపుల్లో ప్రధాన భాగాన్ని పొందుతోంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో.. భారతదేశం $89-బిలియన్ల చెల్లింపులను అందుకుంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలకు గల్ఫ్ దేశాల నుంచి అత్యధిక రెమిటెన్స్‌లు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాల నుంచి రెమిటెన్స్‌లు తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గింపు ప్రభావం ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తుంది. నైపుణ్యం లేని కార్మికులు పెద్ద సంఖ్యలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కానీ అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళే భారతీయులు ఎక్కువగా నైపుణ్యం, ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు.

ఈ మధ్య కాలంలో బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్య పెరిగింది. గత మూడేళ్లలో 3.9 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లారని ప్రభుత్వమే పేర్కొంది. ఈ 3.9 లక్షల మందిలో 1.7 లక్షల మందికి పైగా అమెరికాలో స్థిరపడ్డారు. భారతీయులు విదేశాల్లో స్థిరపడితే, ఇప్పుడు భారత్‌కు తక్కువ రెమిటెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో భారత్‌కు రెమిటెన్స్‌లో పతనం కొనసాగవచ్చని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

Source Link

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..