EPFO: దీపావళికి ముందే ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ జమ అయ్యేది అప్పుడే..
దీపావళి వచ్చింది. పీఎఫ్ ఖాతాదారులకు వెలుగులు నింపింది. ఈపీఎఫ్ ఉద్యోగుల ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము జమ అయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ తమ ఖాతాదారులకు దీపావళి కానుకగా వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పీఎఫ్ ఖాతాల్లో నిలువ ఉన్న పెట్టుబడిపై 8.15శాతం వడ్డీని డిపాజిట్ చేసింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ డబ్బులు వచ్చి చేరింది. మరి కొందరికి జమ అవ్వడానికి కొంత సమయం
దీపావళి వచ్చింది. పీఎఫ్ ఖాతాదారులకు వెలుగులు నింపింది. ఈపీఎఫ్ ఉద్యోగుల ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము జమ అయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ తమ ఖాతాదారులకు దీపావళి కానుకగా వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పీఎఫ్ ఖాతాల్లో నిలువ ఉన్న పెట్టుబడిపై 8.15శాతం వడ్డీని డిపాజిట్ చేసింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ డబ్బులు వచ్చి చేరింది. మరి కొందరికి జమ అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.
ఈపీఎఫ్ చెప్పిన దాని ప్రకారం.. తమ వినియోగదారుల ఖాతాల్లో వడ్డీని డిపాజిట్ చేసేందుకు ఒక ప్రక్రియను అవలంభిస్తుంది. తద్వారా నిలువ ఉన్న సొమ్ముపై పూర్తి వడ్డీని చెల్లించేందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించింది. అందుకే ఉద్యోగులు ఓపిక పట్టాలని ఈపీఎఫ్‌వో ఖాతాదారులను కోరింది. ప్రస్తుతం వడ్డీలో ఎలాంటి తగ్గింపు ఉండదని పేర్కొంది. 24 కోట్ల ఖాతాల్లో వడ్డీ జమ అయినట్లు తెలిపింది. వడ్డీని క్రెడిట్ చేసిన తర్వాత పీఎఫ్ ఖాతాదారుడి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
ఒకవేళ మెసేజ్ రాకపోతే యూపీఎఫ్ సంస్థకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా తమ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దీంతో పాటూ ఉమంగ్ యాప్, ఈపీఎఫ్ఓవెబ్సైట్ ద్వారా కూడా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లోని బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించి ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పీఎఫ్ వడ్డీ రేటును నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటును ప్రకటించినట్లు వివరించారు. గత సంవత్సరం ఈపీఎఫ్వోతన చందాదారులకు వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి తగ్గించినట్లు తెలిపింది. 2020-21లో 8.10% నుంచి 8.5% శాతానికి తగ్గించింది. 1977-78లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..