LIC Scheme: ఆదాయానికి ఆదాయం, భద్రతకు భద్రత.. ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్..
ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఒక్కసారిగా పెట్టుబడి పెడితే చాలు నెలవారీగా పెన్షన్ పొందొచ్చు. పదవి విరమణ తర్వాత నెలవారీ కచ్చితమైన రిటర్న్స్ పొందాలనుకునే వారికి ఈ ఎల్‌ఐసీ పథకం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎల్‌ఐసీ ఎన్నో రకాల ఆకర్షణీయమైన పథకాలను తీసుకొస్తోంది. అయితే ఎల్‌ఐసీ అంటకే కేవలం ప్రమామ బీమా గురించే ఆలోచిస్తారు. కానీ పెట్టుబడికి కూడా ఇందులో ఎన్నో మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఒక్కసారిగా పెట్టుబడి పెడితే చాలు నెలవారీగా పెన్షన్ పొందొచ్చు. పదవి విరమణ తర్వాత నెలవారీ కచ్చితమైన రిటర్న్స్ పొందాలనుకునే వారికి ఈ ఎల్‌ఐసీ పథకం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీని 39 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా ఇన్‌కమ్ పొందొచ్చు. ఈ ప్లాన్‌ను సింగిల్‌గా, జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు. భార్యభర్తలిద్దరూ నెలవారీ పెన్షన్ పొందొచ్చు. పదవి విరమణ తర్వాత జీవితాంతం స్థిరమైన పెన్షన్‌ను పొందొచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి 55 ఏళ్లు ఉన్న వ్యక్తి రూ. 11 లక్షలు డిపాజిట్ చేశాడని అనుకుందాం.
ఐదేళ్లపాటు ఈ పెట్టుబడిని అలాగే ఉంచాలి అనంతరం ఈ మొత్తంతో కలిపి పెట్టుబడిపై మీరు ఏడాదికి రూ. 1,01,880 పొందుతారు. ఈ లెక్కన మీరు ఆరు నెలలకు రూ. 49,911, నెలవారీగా చెప్పాలంటే రూ. 8,149 సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ పాలసీని ఎప్పుడైనా సరెండర్ చేసే అవకాశం కల్పించారు. ఈ పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో భాగంగా కనీసం రూ. 1.5 లక్ష పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమి లేదు. ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే, అతని ఖతాలో జమ అయిన మొత్తం నామినీకి చెల్లిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..