Union Budget 2023: చిన్న పరిశ్రమల మనుగడకు ఊపిరి పోస్తారా?

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ సందర్భంగా కోటి ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌. ఎందుకంటే 2024లో అసెంబ్లీ ఎన్నికలు..

Union Budget 2023: చిన్న పరిశ్రమల మనుగడకు ఊపిరి పోస్తారా?
Budget Latter
Follow us
Subhash Goud

|

Updated on: Jan 20, 2023 | 9:28 AM

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ సందర్భంగా కోటి ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌. ఎందుకంటే 2024లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఈ బడ్జెట్‌లోనైనా తమ ఆశలు నెరవేరుతాయా? అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రజల అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి నిర్మలమ్మకు లేఖలు రాస్తున్నారు.

గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి,

నేను సుందర రావు.. వరంగల్ లో నివాసిస్తున్నాను. నాకు వరంగల్ శివార్లలో ఒక గోనె సంచులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ప్రస్తుతం నేను ఫైర్ సర్వీస్ ఆఫీస్ బయట చెట్టుకింద కూచుని ఉన్నాను. ఇప్పుడు నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ఎన్వో సీ రెన్యువల్ కోసం ఫైల్ తీసుకుని వచ్చాను. అధికారులు దీనికోసం నన్ను వేధిస్తున్నారు. బయట ఫైల్ తో వెయిట్ చేయమని చెప్పారు. సార్ లంచ్ కి వెళ్లారట.. ఆయన వచ్చే వరకూ ఉండమని చెప్పారు.

చాలా సేపటి నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ సమయంలో నా పరిస్థితి గురించి మీకు లెటర్ రాయాలని పించింది. నా మొబైల్ లో ఈ లెటర్ రాస్తున్నాను. మామూలుగా అయితే, ఎక్కువసార్లు ఈ సమయంలో అనేక విభాగాల ప్రభుత్వ అధికారులు.. ఉద్యోగులు నా ఫ్యాక్టరీలో నాతో పాటు భోజనం చేస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు ఎన్వోసీ కోసం ఫైర్ సర్వీస్ ఆఫీస్ కు రావాల్సి వచ్చింది. ఇంత అధికారులతో పరిచయం ఉన్నా సరే.. నా అప్లికేషన్ క్లియర్ చేయడానికి నన్ను ఆఫీసు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఇది నాకు కొత్త కాదు అనుకోండి.

ఎందుకంటే, ఇలా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మాకు నెలలో సగం రోజులు గడిచిపోతుంటాయి. కొన్నిసార్లు.. EPFO ఆఫీసు.. మరి కొన్నిసార్లు కాలుష్య విభాగం, ఇంకొన్ని సార్లు ESIC కార్యాలయం.. ఇదిగో అప్పుడప్పుడు ఇలా ఫైర్ సర్వీస్ ఆఫీస్.. మేము తప్పనిసరిగా వెళ్ళి అనుమతులు తీసుకోవలసిన ప్రభుత్వ విభాగాలు 30 కంటే ఎక్కువ ఉన్నాయి. సింగిల్ విండో స్కీమ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటూ ప్రవేశపెట్టిన విధానాలు ఈ ప్రభుత్వ ఆఫీసుల గుమ్మాలకే పరిమితం అయిపోయాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు. ఈ ఆఫీసుల్లో పనులు పూర్తి అయిన తరువాత మిగిలిన సమయం నేను బ్యాంక్ మేనేజర్ల ముందు గడపాల్సి ఉంటుంది.

ఆర్థిక మంత్రి గారు, నేను మీకు ఒక పచ్చి నిజం చెబుతాను. గత నెలలో, నేను చాలా క్రూరమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నాలో నేను ఎంత ఏడిచానో భగవంతునికే తెలుసు. నా ఫ్యాక్టరీ నుంచి అప్పుడు 25 మంది ఉద్యోగులను తీసివేయాల్సి వచ్చింది. నా ఫ్యాక్టరీలో కార్మికులు నాకు పిల్లల లాంటి వారు. కానీ, పని లేకపోతే నేను మాత్రం ఏమి చేయగలను? నాలో నేను ఏడ్చుకుంటూ ఉండడం తప్ప. నేను వారిని తీసివేయకపోతే.. నా ఫ్యాక్టరీలోని కార్మికులు అందరూ నీరుద్యోగులుగా మారిపోయేవారు.

అంతా బాగానే ఉందని మీరు అంటున్నారు. కానీ, డిమాండ్ ఇక్కడ తిరిగి రావడం లేదు. మా ఖర్చుల గురించి చెప్పాలంటే అది మరింత క్లిష్టమైన పరిస్థితి. ఇక ఫ్యాక్టరీ కోసం తీసుకునే అప్పు చాలా ఖరీదైనదిగా మారిపోయింది. మేము ఇకపై అప్పు తీసుకునే ధైర్యం చేయలేము. మీరు నిజంగా నమ్మలసిన విషయం ఏమిటంటే.. మాకు ఏదైనా ఉపశమనం లభిస్తే, మేము పేదవారికి ఆహారం అందించగలం.

నిర్మలా మేడమ్.. మావి చిన్న- మధ్యతరహా పరిశ్రమలు. కానీ, వీటిని పెద్ద కంపెనీలుగా మార్చాలని మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము. మేము చిన్న పట్టణాలు, నగరాల ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాము. మీరు మీ కార్యాలయానికి పెద్ద పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతారు. మేము ప్రభుత్వ కార్యాలయాల ముందు మెట్లపై కూర్చుని అధికారుల దయ కోసం ఎదురు చూస్తుంటాము. ఆర్థిక మంత్రిగారూ, మా వ్యాపారం ఎలా జరుగుతోందని మమ్మల్ని ఎప్పుడూ అడగవద్దు. కానీ, రాబోయే బడ్జెట్ మా ఖర్చులను తగ్గించగలిగితే, అది నాలాంటి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నడిపే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ప్రభుత్వం. మీరు మంత్రి గారు. మీ నుంచి ఆశించడం మా హక్కు. దయచేసి ఇప్పుడే ఏదైనా చేయండి! మా పరిశ్రమల ఉనికిని కాపాడండి.

మీ సుందర రావు

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి