Unclaimed Deposits: రూ.78,213 కోట్లకు వారసులు ఎవరు? పేరుకుపోతున్న అన్‌క్లెయిమ్ డిపాజిట్లు..ఇలా తెలుసుకోండి!
బ్యాంకుల్లో అన్ క్లెయిమ్ డిపాజిట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కోట్లాది రూపాయలకు వారసులు ఎవరు లేకపోవడంతో బ్యాంకుల్లో మగ్గిపోతున్నాయి. గత పదేళ్లుగా డిపాజిట్ అయిన వేల కోట్ల రూపాయలకు సంబంధించి వారసులు ఎవరు లేకపోవడంతో అలాగే ఉండిపోతున్నాయి. అయితే డిపాజిట్ చేసిన ఖాతాదారుల చిరునామాను గుర్తించేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. అటువంటి డిపాజిట్లకు సంబంధించి వారసులను..
బ్యాంకుల్లో అన్ క్లెయిమ్ డిపాజిట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కోట్లాది రూపాయలకు వారసులు ఎవరు లేకపోవడంతో బ్యాంకుల్లో మగ్గిపోతున్నాయి. గత పదేళ్లుగా డిపాజిట్ అయిన వేల కోట్ల రూపాయలకు సంబంధించి వారసులు ఎవరు లేకపోవడంతో అలాగే ఉండిపోతున్నాయి. అయితే డిపాజిట్ చేసిన ఖాతాదారుల చిరునామాను గుర్తించేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. అటువంటి డిపాజిట్లకు సంబంధించి వారసులను కనుగొనేందుకు ఆర్బీఐ ఉద్గం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మార్చి 31, 2024 చివరి నాటికి బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. మార్చి 2023 చివరి నాటికి ఈ సంఖ్య రూ.62,225 కోట్లు. సహకార బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు, 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా తమ ఖాతాలలో ఉన్న ఖాతాదారుల క్లెయిమ్ చేయని డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ చేస్తాయి.
ఒకే క్లిక్‌తో సెర్చ్ చేయండి: ఖాతాదారులకు సహాయం చేయడానికి, పనిచేయని ఖాతాలను గుర్తించడానికి ఆర్బీఐ ఉద్గం పోర్టల్‌ను ప్రారంభించింది. దీని సహాయంతో దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఒక్క క్లిక్‌తో వెతకవచ్చు. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేసి ఆ క్లెయిమ్ చేయని డిపాజిటర్ ఎవరో తెలుసుకోవచ్చు.
27,000 కోట్ల విలువైన బంగారు బాండ్లను కొనుగోలు చేసింది:
అధిక రాబడులు, పన్ను ప్రయోజనాలకు అవకాశం ఉన్నందున ప్రభుత్వ బంగారు బాండ్ల వైపు మొగ్గు పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు రూ. 27,031 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. ఇది 2022-23లో కొనుగోలు చేసిన బంగారు బాండ్లకు నాలుగు రెట్లు ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ గోల్డ్ బాండ్ (SGB) ద్వారా 44.34 టన్నుల బంగారాన్ని రూ.6,551 కోట్లకు కొనుగోలు చేశారు. సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలో ఈ సమాచారం ఇచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2023-24లో సావరిన్ గోల్డ్ బాండ్ నుండి సేకరించిన మొత్తం రూ. 27,031 కోట్లు (44.34 కోట్లు). సావరిన్ గోల్డ్ బాండ్ పథకం గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు దశల్లో జారీ చేయబడింది. నవంబర్ 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి, 67 విడతల్లో మొత్తం రూ.72,274 కోట్లు (146.96 టన్నులు) సేకరించాయి. గత ఏడాది కాలంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.62,300 నుంచి 10 గ్రాములకు రూ.73,200కి పెరిగింది. ఇంత జరుగుతున్నా బంగారం పట్ల ప్రజల్లో మక్కువ తగ్గడం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి