
జపనీస్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ అయిన కవాసకీ తమ తాజా బైక్స్‌పై కొత్త డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28, 2025 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుబాటులో ఉంటాయని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కవాసకి ఇండియా పోర్ట్‌ఫోలియోలోని ఎంపిక చేసిన బైక్స్‌పై రూ.15,000 నుంచి రూ. 45,000 వరకు డిస్కౌంట్లు ఉంటాయి. కవాసకి నింజా 300, నింజా 500,, నింజా 650 బైకులపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవాసకీ బైక్‌ల ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కవాసకి నింజా 300 తక్కువ ధరలో అందుబాటులో ఉండే స్పోర్ట్స్ బైక్. ఈ బైక్‌ను రూ.3.43 లక్షల ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ బైక్‌పై కవాసకీ కంపెనీ రూ.30,000 తగ్గింపును ప్రకటించింది. సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లిక్విడ్-కూల్డ్ 296 సీసీ పారలల్-ట్విన్ ఇంజిన్‌తో వచ్చే నింజా 300 బైక్ 11,000 ఆర్‌పీఎం వద్ద 38.8 బీహెచ్‌పీ, 10,000 ఆర్‌పీఎం వద్ద 26.1 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
కవాసకి నింజా 500 స్పోర్ట్స్ బైక్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా వస్తుంది. ఈ బైక్ ధర రూ.5.29 లక్షలుగా ఉంది. అయితే ఈ బైక్‌పై కవాసకీ కంపెనీ రూ.15,000 తగ్గింపును అందిస్తుంది. నింజా 500 451 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ బైక్ 9,000 ఆర్‌పీఎం వద్ద 45 బీహెచ్‌పీ, 6,000 ఆర్‌పీఎం వద్ద 42.6 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు స్లిప్-అండ్-అసిస్ట్ క్లబ్లో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ నింజా 500 గత నెలలోనే కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసింది.
కవాసకి నింజా 650 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.16 లక్షలగా ఉంది. అయితే ఈ బైక్‌పై కవాసకీ కంపెనీ రూ.45,000 తగ్గింపును ప్రకటించింది. ఈ బైక్ 649 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. సిక్స్ -స్పీడ్ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ బైక్ 8,000 ఆర్‌పీఎం వద్ద 67.3 బీహెచ్‌పీ, 6,700 ఆర్‌పీఎం వద్ద 64.0 ఎన్ఎం టార్క్ న్ను ఉత్పత్తి చేస్తుంది. 2025 మోడల్ ఇయర్ కవాసకి నింజా 650 లైమ్ గ్రీన్ లేదా పెర్ల్ ఫ్లాట్ స్టార్ డస్ట్ వైట్ కలర్ స్కీమ్‌తో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి