Elon Musk: ట్విట్టర్ బోర్డు సభ్యుడిగా ఎలాన్ మస్క్..! అసలు మ్యాటర్ ఏమిటంటే..
Elon Musk: అమెరికాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా(Tesla Motors) అధినేత ఎలాన్ మస్క్ తన పంతాన్ని నిలబెట్టుతున్నారు. తాజాగా కంపెనీలో వాటాలు కొన్న ఆయన బోర్డులో సైతం అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
Elon Musk: అమెరికాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా(Tesla Motors) అధినేత ఎలాన్ మస్క్ తన పంతాన్ని నిలబెట్టుతున్నారు. సోషల్ మీడియా(Social Media) నెట్వర్క్ ‘ట్విట్టర్’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సభ్యుడు కానున్నారు. మంగళవారం దాఖలు చేసిన రెగ్యూలెటరీ ఫైలింగ్స్ ప్రకారం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నియమితులయ్యారు. 2024 వార్షిక షేర్‌హోల్డర్స్ సమావేశం వరకు సభ్యుడిగా మస్క్ కొనసాగనున్నారు. ఎలాన్ మస్క్ సభ్యుడిగా ఉన్నంతకాలం.. ఒంటరిగా లేదా బృందంగానైనా ట్విట్టర్లో 14.9 శాతం కన్నా ఎక్కువ వాటాలను కొనుగోలు చేసేందుకు వీలులేదని తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో ఓపెన్ మార్కెట్ పద్ధతిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీలో 9.20 శాతం వాటాను కొనుగోలు చేశారు.
ఎలాన్ మస్క్ బోర్డు సభ్యుడిగా నియమితులు కావడం పట్ల ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ స్పందించారు. మస్క్‌తో గత కొన్ని వారాలుగా మాట్లాడుతున్నామని.. ఆయన తమ బోర్డుకు గొప్ప బలం అని పరాగ్ అన్నారు. “మస్క్ మంచి విమర్శకుడు. మా సంస్థ బలోపేతానికి ఇలాంటి వ్యక్తి అవసరం” అని ట్వీట్ చేశారు. ట్విట్టర్లో పరిమిత వాటాను విధించడం.. సంస్థ వ్యూహత్మక పథకంలో భాగమని అన్నారు.
దాదాపు 73.5 మిలియన్ షేర్లను ట్విట్టర్లో మస్క్ కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు 6 శాతం పెరిగాయి. గతంలో ట్విట్టర్ సామర్థ్యంపై, వాక్ స్వాతంత్య్రంపై మస్క్ అనేక పోల్స్ నిర్వహించారు. దీంతో పాటు గతంలో కొత్త సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సంచలన ట్వీట్ చేశారు. తాజాాగా మంగళవారం సైతం ట్విట్టర్ లో ఎడిట్ బటన్ కావాలా అంటూ మరో పోల్ నిర్వహించారు. ట్విట్టర్ వేధికగా జరుగుతున్న పరిణామాలపై నెటిజన్లు సైతం అమితమైన ఉత్సాహం చూపుతున్నారు.
I’m excited to share that we’re appointing @elonmusk to our board! Through conversations with Elon in recent weeks, it became clear to us that he would bring great value to our Board.
— Parag Agrawal (@paraga) April 5, 2022
ఇవీ చదవండి..
Loan Fraud: లోన్ మోసాలపై ఇలా జాగ్రత్త పడండి.. లేకుంటే వారిలా ఇబ్బందిపడతారు..
LIC IPO: మేలో ఎల్‌ఐసీ ఐపీఓ..! 5 శాతానికి బదులు 7 శాతం వాటా విక్రయించాలని యోచన..!