AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: ట్రంప్‌ జీవితంలో మరపురాని రోజు.. తొలిసారి ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆయన వ్యాపార సామ్రాజ్యం మునుపెన్నడూ లేని విధంగా లాభాల బాట పట్టింది. ట్రంప్‌ ఆదాయం పెరగడంతో.. ఆయన జీవితంలో మరపురాని ఘట్టం చోటు చేసుకుంది. ఒకేసారి డబుల్‌ ధమాకా ట్రంప్‌ జీవితంలో చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి పూర్తవడంతో ట్రంప్‌ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన..

Donald Trump: ట్రంప్‌ జీవితంలో మరపురాని రోజు.. తొలిసారి ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!
Donald Trump
Srilakshmi C
|

Updated on: Mar 26, 2024 | 11:52 AM

Share

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆయన వ్యాపార సామ్రాజ్యం మునుపెన్నడూ లేని విధంగా లాభాల బాట పట్టింది. ట్రంప్‌ ఆదాయం పెరగడంతో.. ఆయన జీవితంలో మరపురాని ఘట్టం చోటు చేసుకుంది. ఒకేసారి డబుల్‌ ధమాకా ట్రంప్‌ జీవితంలో చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి పూర్తవడంతో ట్రంప్‌ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన తొలి 500 మందిలో ఆయనకు స్థానం దక్కించుకొన్నారు. తాజా అంచనాల ప్రకారం ట్రంప్‌ సంపద నికర విలువ 4 బిలియన్‌ డాలర్లకుపైగా (రూ.33 వేల కోట్లు) పెరిగింది. తొలిసారిగా ట్రంప్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 6.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో చేరారు. గతంలో ఎన్నడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో పెరగలేదు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.

మరోవైపు.. ట్రంప్‌ సంపద గురించి అసత్యాలు చెప్పిన కేసులో దిగువ కోర్టు రూ.3,788 కోట్ల (500 మిలియన్‌ డాలర్లు) భారీ జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. దీనిని నిలిపివేయాలని కోరుతూ ట్రంప్‌ ఇటీవల కోర్టు స్టేట్ అప్పీల్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిని విచారించిన కోర్టు ఆ మొత్తాన్ని 175 మిలియన్‌ డాల్లర్ల (రూ.1460 కోట్లు)కు తగ్గించింది. ఆ మొత్తాన్ని పది రోజుల్లో ట్రంప్‌ చెల్లిస్తే రూ.3,788 కోట్లు చెల్లించకుండా నిలుపుదల చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

అదే సమయంలో ట్రాంప్‌ సోషల్ మీడియా కంపెనీ ట్రంప్ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్ 29 నెలల తర్వాత డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌ (DWAC)తో విలీనం అయ్యింది. ఆ కంపెనీలో ట్రంప్‌కు ఉన్న 58% వాటా విలువ 3.9 బిలియన్ డాలర్లు. ఇక DWAC షేర్లు సోమవారం $49.95 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంత పెద్ద మొత్తం పెరగడం ఇదే తొలిసారి. సుమారు 185 శాతం పెరిగాయి. ఇలా కాలం కలిసి రావడంతో బిలియన్ డాలర్ల విలువైన ట్రంప్‌ షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ట్రంప్‌ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.