మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా.? మీ అకౌంట్‌ను ఒక ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటున్నారా? ఒకప్పుడు అయితే ఇలా బ్రాంచ్ మార్చుకోవాలనుకుంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. బ్యాంకుకు వెళ్లి లైన్‌లో నిల్చొని, అప్లికేషన్ ఫామ్ ఫిమ్ చేసి, సబ్‌మిట్ చేయడం పెద్ద తతంగమే ఉండేది. అయితే మారుతోన్న కాలానికి అనుగుణంగా బ్యాంకులు అందిస్తోన్న సేవల్లోనూ మార్పులు వచ్చాయి. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ హోమ్ బ్రాంచ్‌ను మార్చుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది. బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లో బ్రాంచ్ మార్చుకునే అవకాశం కల్పించింది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, యోనో యాప్ ద్వారా బ్రాంచ్ మార్చుకునే అకవాశం కల్పించారు.
ఇందుకోసం ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. అనంతరం పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఇ-సర్వీస్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. అనంతరం ట్రాన్స్‌ఫర్ సేవింగ్స్ అకౌంట్‌పై క్లిక్ చేసి.. మీరు బ్రాంచ్ మార్చాలనుకుంటున్న అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి. చివరిగా కన్ఫామ్ బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే.. మూడు రోజుల్లో మీరు కోరుకున్న బ్రాంచ్‌కి మీ అకౌంట్ మారుతుంది.
ముందుగా స్మార్ట్‌ఫోన్‌లోని యోనో యాప్‌ను ఓపెన్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ట్రాన్స్‌ఫర్ సేవింగ్ అకౌంట్ ను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు ఏ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి. బ్యాంకు పేరు డిస్‌ప్లే అవుతుంది. వివరాలు చూసుకొని సబ్మిట్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి. ఇలా చేస్తే మీ బ్రాంచ్ మూడు రోజుల్లో మారుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..