AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: తక్కువ పెట్టుబడితో బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్స్‌.. ఆదాయం కూడా అదుర్స్‌.

ఉద్యోగం ఎంత పెద్దదైనా ఉద్యోగివే అవుతావు, వ్యాపారం ఎంత చిన్నదైనా యజమానివే అవుతావు. సాధారణంగా చెప్పే కొటేషన్‌ ఇది. మనలో చాలా మంది ఇదే ఆలోచనతో ఉంటారు. అయితే వ్యాపారం అనేసరికి ఎక్కడో భయం ఉంటుంది. లాభం వస్తుందో రాదో అని, నష్టం ఉంటుంది అనే ఆలోచనలో ఉంటారు. అయితే తెలివిగా ఆలోచించాలే కానీ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను తెచ్చిపెట్టే వ్యాపారాలు కూడా ఉన్నాయి. కేవలం....

Business Idea: తక్కువ పెట్టుబడితో బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్స్‌.. ఆదాయం కూడా అదుర్స్‌.
Business Ideas
Narender Vaitla
|

Updated on: Oct 13, 2023 | 10:27 PM

Share

ఉద్యోగం ఎంత పెద్దదైనా ఉద్యోగివే అవుతావు, వ్యాపారం ఎంత చిన్నదైనా యజమానివే అవుతావు. సాధారణంగా చెప్పే కొటేషన్‌ ఇది. మనలో చాలా మంది ఇదే ఆలోచనతో ఉంటారు. అయితే వ్యాపారం అనేసరికి ఎక్కడో భయం ఉంటుంది. లాభం వస్తుందో రాదో అని, నష్టం ఉంటుంది అనే ఆలోచనలో ఉంటారు. అయితే తెలివిగా ఆలోచించాలే కానీ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను తెచ్చిపెట్టే వ్యాపారాలు కూడా ఉన్నాయి. కేవలం రూ. 50 వేలలోపు క్యాపిటల్‌తో మొదలు పెట్టే వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఉత్తమ బిజినెస్‌ ఐడియాలపై ఓ లుక్కేయండి..

* తక్కువ పెట్టుబడిలో వ్యాపారం చేయాలంటే వస్త్ర రంగం ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే రంగాల్లో క్లాతింగ్ ఇండస్ట్రీ ముఖ్యమైంది. అయితే రూ. 50 వేలలోపు బడ్జెట్‌తో దుకాణాలను ఏర్పాటు చేయకపోయినా ఊర్లో అంగట్లో లేదా బండిపై తిరుగుతూ వస్త్రాలు అమ్మే వారికి ఇది బెస్ట్‌ అని చెప్పొచ్చు. కిరాయి లేకుండా లాభాలు ఆర్జించవచ్చు.

* భారతదేశంలో ఫుడ్ బిజినెస్‌ ఎప్పటికీ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగుతుందని తెలిసిందే. తక్కువ పెట్టుబడితో ప్రారంభించే బిజినెస్‌లో ఫుడ్ బిజినెస్‌ ఒకటి. ఫుడ్‌ స్టాల్స్‌ లేదా ఫుడ్ ట్రక్కులను ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా కాలేజీలు, యూత్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మొబైల్‌ ఫుడ్ ట్రాక్స్‌ ఏర్పాటు చేయడం వల్ల అధికంగా లాభం పొందొచ్చు. ఇందులో కూడా దుకాణాలకు ఎలాంటి కిరాయి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

* ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాల్లో ట్యూషన్‌ ఒకటి. కేవలం మీ జ్ఞానాన్ని పంచడం ద్వారా డబ్బులు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా ట్యూషన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్‌లో కూడా ట్యూషన్‌ చెబుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. యూట్యూబ్‌లో ట్యూషన్‌ చెబుతూ భారీగా సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకొని, ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

* ప్రస్తుత కాలంలో వెడ్డింగ్‌ ప్లానర్స్‌, ఈవెంట్ మేనేజర్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. తక్కువ పెట్టుబడితో కేవలం మ్యానేజ్‌ చేయడం ద్వారానే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఫొటోగ్రఫీ, డెకరేషన్‌ వంటి వారితో అంగీకారం చేసుకొని పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్స్‌ తీసుకోవచ్చు. అత్యంత తక్కు పెట్టుబడితో మంచి ఆదాయం పొందే మార్గాల్లో ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

* పచ్చడి తయారీ కూడా మంచి బిజినెస్‌ ఐడియాగా చెప్పొచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంట్లోనే ఊరగాయలను తయారు చేసి దుకాణాల్లో అమ్ముకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈకామర్స్‌ సైట్స్‌ విస్తృతి పెరిగిన తర్వాత ఆన్‌లైన్‌లో కూడా చట్నీలను అమ్ముకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా ఈ కామర్స్‌లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..