Insurance Sector: ఇన్సూరెన్స్ రంగంలో ఏజెంట్ల వ్యవస్థకు బ్యాడ్ డేస్.. ఎందుకంటే..
IRDA ప్రతిపాదన ఏమిటో చూద్దాం. సాధారణంగా, ప్రధాన ఆరోగ్య , జీవిత బీమా పాలసీలలో, దాదాపు 30 శాతం ప్రీమియం ఏజెంట్‌కు కమీషన్ అలాగే ప్రోత్సాహకాల రూపంలో వెళుతుంది. బీమా కంపెనీల ఖర్చు కూడా కలిపితే, ఈ ఖర్చు ప్రీమియంలో సగం దాకా ఉంటుంది. దీని ప్రత్యక్ష భారం వినియోగదారుడిపైనే పడుతుంది. ఈ వ్యయాన్ని అరికట్టేందుకు, నిర్వహణ వ్యయం (EOM)పై ఖర్చును ప్రీమియంలో 30 శాతానికి పరిమితం..
ఇంతవరకూ ఇన్సూరెన్స్ రంగంలో ఏజెంట్ల హవా నడిచింది. ఇకపై అలా ఉండకపోవచ్చు. బిజినెస్ పెంచుకోవడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక మీదట ఏజెంట్లకు కమీషన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించలేవు. ఎందుకంటే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) బీమా ఏజెంట్ల కమీషన్‌ను 20 శాతానికి పరిమితం చేయాలని ప్రతిపాదించింది. బీమా వ్యాపారంలో కమీషన్‌ను ఓపెన్ గా చెప్పించేందుకు కూడా ప్రస్తుతం IRDA కృషి చేస్తోంది. ఈ పథకం కింద, బీమా ప్రీమియంలో ఏజెంట్‌కు చెల్లించిన కమీషన్ వివరాలను పేమెంట్ రిసిప్ట్ లో ఇవ్వడం తప్పనిసరి చేయబోతోంది. మొత్తంమీద, బీమా కస్టమర్లు ఈ మార్పుల ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతారు.
IRDA ప్రతిపాదన ఏమిటో చూద్దాం. సాధారణంగా, ప్రధాన ఆరోగ్య , జీవిత బీమా పాలసీలలో, దాదాపు 30 శాతం ప్రీమియం ఏజెంట్‌కు కమీషన్ అలాగే ప్రోత్సాహకాల రూపంలో వెళుతుంది. బీమా కంపెనీల ఖర్చు కూడా కలిపితే, ఈ ఖర్చు ప్రీమియంలో సగం దాకా ఉంటుంది. దీని ప్రత్యక్ష భారం వినియోగదారుడిపైనే పడుతుంది. ఈ వ్యయాన్ని అరికట్టేందుకు, నిర్వహణ వ్యయం (EOM)పై ఖర్చును ప్రీమియంలో 30 శాతానికి పరిమితం చేయాలని IRDA ప్రతిపాదించింది. EOMలో ఏజెంట్ కమిషన్ బీమా కంపెనీ ఇతర ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. అయితే, మొత్తం ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా కంపెనీల EOM 70 శాతం కంటే తక్కువగా ఉంటే, అప్పుడు వారు తమ ఇష్ట ప్రకారం కమీషన్ రేటును నిర్ణయించవచ్చని ప్రతిపాదనలో చెబుతున్నారు.
ఈ ప్రతిపాదన చాలాకాలంగా ఇండస్ట్రీలో నాలుగుతోంది. కానీ దానిని అమలులోకి తీసుకురావడంలో ఎందుకు ఆలస్యం అవుతోంది తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDA ఈ ప్లాన్ ఫలించినట్లయితే, అది బీమా రంగంపై సానుకూల ప్రభావం చూపుతుంది. నిజానికి, దేశంలో నాలుగు శాతం జనాభాకు మాత్రమే ఆరోగ్య బీమా పరిమితం కావడానికి ప్రధాన కారణం ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇన్సూరెన్స్ ను చౌకగా చేసేందుకు కసరత్తులో భాగంగా IRDA ఈ చర్య తీసుకుంది. రానున్న రోజుల్లో ఏజెంట్ల కమీషన్ 10 శాతం తగ్గితే, కంపెనీల నిర్వహణ వ్యయాన్ని అరికట్టినట్లయితే, ఇది ఇన్సూరెన్స్ పాలసీ తక్కువ ధరలో అందించవచ్చు. దీంతో దేశంలో ఇన్సూరెన్స్ పరిధిని పెంచుకోవచ్చు. కొత్త బిజినెస్ మోడల్స్, ప్రొడక్ట్స్, స్ట్రాటజీస్ డెవలప్ చేయడంలో బీమా సంస్థలకు సహాయపడటానికి IRDAI నిబంధనలు, 2016 ను సమీక్షిస్తామని IRDAI తన నోటీసులో పేర్కొంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు మారుతున్న బీమా అవసరాలకు అనుగుణంగా తమ ఖర్చులను నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
బీమా కంపెనీల ఏజెంట్ల కమీషన్ మొదటి సంవత్సరంలో తగ్గిపోవచ్చని, అయితే ఇది వారి ఆదాయాలపై పెద్దగా ప్రభావం చూపదని ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ వికాస్ సింఘాల్ చెప్పారు. ఎందుకంటే మొదటి సంవత్సరం తర్వాత ఏజెంట్ల కమీషన్ పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు, ఏజెంట్లు మొదటి సంవత్సరం తర్వాత 5 నుంచి 7 శాతం కమీషన్ పొందేవారు, ఇప్పుడు దానిని 10 శాతానికి పెంచాలని ఆలోచిస్తున్నారు. విశేషమేమిటంటే.. తొలి ఏడాది కమీషన్ తగ్గించడం వల్ల బీమా పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇది దేశంలో బీమా పరిశ్రమ అభివృద్ధికి దారి తీస్తుంది. సహజంగానే, బీమాకు డిమాండ్ పెరిగేకొద్దీ, ఏజెంట్ల ఆదాయాలు కూడా పెరుగుతాయి.
రెగ్యులేటర్ కొత్త ప్లాట్‌ఫారమ్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఇటీవల IRDA తెలిపింది. అన్ని బీమా కంపెనీలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ అవుతాయి. బీమా కొనుగోలు, సర్వీసింగ్, చెల్లింపు ఇక్కడ నుండి క్లెయిమ్ చేయవచ్చు. ఏదైనా పాలసీ ఏజెంట్ బీమాను విక్రయించాలనుకుంటే, అతను ఈ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. దీని తర్వాత అతను ఏదైనా కంపెనీ ఇన్సూరెన్స్ ను సేల్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను సంవత్సరం చివరి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. దీని నియంత్రణ కూడా IRDA చేస్తుంది. మొత్తంమీద, IRDA చేస్తున్న కసరత్తు బీమా రంగంలో పారదర్శకతను పెంచుతుంది. ఇది అమలులోకి వస్తే ఇన్సూరెన్స్ వ్యాపారం పరిధి పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి