IRDAI: కొత్త సంవత్సరంలో బీమా తీసుకుంటున్నారా.. ఈ నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే
Insurance KYC: మీరు వాహన బీమా లేదా ఇంకేదైనా జనరల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. 2023 జనవరి నుంచి హెల్త్, వెహికల్, ట్రావెల్, హౌస్ ఇన్య్సూరెన్స్ సహా మరేదైనా సాధారణ బీమా తీసుకుంటే నిబంధనలు మారనున్నాయి. కొత్త ఏడాది నుంచి జనరల్..

Insurance KYC: మీరు వాహన బీమా లేదా ఇంకేదైనా జనరల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. 2023 జనవరి నుంచి హెల్త్, వెహికల్, ట్రావెల్, హౌస్ ఇన్య్సూరెన్స్ సహా మరేదైనా సాధారణ బీమా తీసుకుంటే నిబంధనలు మారనున్నాయి. కొత్త ఏడాది నుంచి జనరల్ ఇన్య్సూరెన్స్ తీసుకునే కస్టమర్లు తప్పకుండా కెవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం తప్పనిసరి. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా- IRDAI నిబంధనలు జారీచేసింది. ప్రీమియం విలువతో సంబంధం లేకుండా.. ఈ నిబంధన అన్ని రకాల బీమాలకు వర్తించనుంది. ప్రస్తుతం, ఆరోగ్య బీమా, వాహన బీమా, ప్రయాణ బీమా పాలసీల వంటి జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి KYC పత్రాలు తప్పనిసరి కాదు. అయితే ఆరోగ్య బీమా పాలసీలో మాత్రమే క్లెయిమ్ చేసినప్పుడు విలువ లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటే కస్టమర్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డును సమర్పించాలి.
కొత్త నిబంధన ప్రకారం క్లెయిమ్ సమయంలో కాకుండా.. పాలసీని కొనుగోలు చేసే సమయంలోనే కెవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం తప్పనిసరికానుంది. ఇప్పటివరకు జనరల్ ఇన్య్సూరెన్స్ పాలసీ తీసుకునే కస్టమర్లు కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరికాదు, ఖాతాదారుడికి ఆప్షన్‌గా ఉండేది. అయితే 2023 జనవరి 1 నుంచి ప్రీమియం మొత్తంతో సంబంధం లేకుండా అన్ని రకాల బీమా పాలసీలపై కస్టమర్‌ల నుంచి బీమా కంపెనీలు KYC పత్రాలు తీసుకోవడం తప్పనిసరికానుంది.
ఇప్పటికే పాలసీ తీసుకున్న కస్టమర్‌లు నిర్ధిష్ట వ్యవధిలోపు KYC డాక్యుమెంట్‌లను సేకరించాలని ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలను కోరింది. ఈ కాలపరిమితి తక్కువ రిస్క్ పాలసీదారులకు రెండేళ్లు, అధిక రిస్క్ కస్టమర్లకు ఒక సంవత్సరం గడువు ఇచ్చింది. KYC డాక్యుమెంట్లను సకాలంలో సమర్పించాలని బీమా కంపెనీలు మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కస్టమర్లకు తెలియజేస్తాయి. ప్రస్తుత కస్టమర్‌లు తమ పాలసీలను పునరుద్ధరించుకోవడానికి KYC పత్రాలను సమర్పించడం తప్పనిసరి కాదు. అయితే పాలసీ గడువు 2023 జనవరి 1 తర్వాత పునరుద్దరించుకుంటే కెవైసీ కోసం ఫోటో ID, అడ్రస్ ప్రూఫ్ సమర్పించమని బీమా సంస్థలు కోరనున్నాయి.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..