Apple Store In India: భారతదేశంలో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభించనున్న టిమ్ కుక్.. అనంతరం ప్రధాని మోదీతో సమావేశం..
ఇప్పటివరకు ఆపిల్ తన ఉత్పత్తులను రీసెల్లర్లు లేదా అమెజాన్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా విక్రయిస్తోంది. అయితే ఇక ముందు తమ సొంత స్టోర్స్‌లో..
భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్ మంగళవారం( 18 ఏప్రిల్ 2023న) ముంబైలో ప్రారంభించనుంది. ఈ లాంచింగ్‌లో పాల్గొనేందుకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్ వచ్చారు. ఈ పర్యటనతో టీమ్ కుక్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆపిల్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం, భారతదేశంలో దాని మొదటి రెండు స్టోర్లు ఈ వారం ముంబై, ఢిల్లీలో తెరవబోతున్నాయి. యాపిల్ భారతదేశంలో 25 సంవత్సరాలు జరుపుకుంటోంది. ఈ వారంలో కంపెనీ తన మొదటి ఆపిల్ స్టోర్‌ను దేశంలో ప్రారంభించడంతో పెద్ద విస్తరణకు సిద్ధమవుతోందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని కొత్త యాపిల్ స్టోర్‌కు కస్టమర్లను స్వాగతించడానికి తాను వేచి ఉండలేనని టిమ్ కుక్ స్వయంగా ట్వీట్ చేశారు.
ఆపిల్ తన మొదటి స్టోర్‌ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభించగా, రెండవ అధికారిక స్టోర్ ఏప్రిల్ 20న ఢిల్లీలో తెరవబడుతుంది. రెండు స్టోర్‌లను స్థానిక ప్రభావంతో రూపొందించినట్లు ఆపిల్ తెలిపింది. కంపెనీ సిఇఒ టిమ్ కుక్ మాట్లాడుతూ, భారతదేశం చాలా అందమైన సంస్కృతి, అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. మా కస్టమర్‌లకు మద్దతివ్వడం, స్థానిక కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడం, మానవాళికి సేవ చేసే ఆవిష్కరణలతో మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కలిసి పని చేయడానికి మేము సంతోషిస్తున్నాం.
Hello, Mumbai! We can’t wait to welcome our customers to the new Apple BKC tomorrow. ?? pic.twitter.com/9V5074OA8W
— Tim Cook (@tim_cook) April 17, 2023
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి ఆపిల్ ఎగుమతులు ఐదు బిలియన్ యుఎస్ డాలర్లను దాటుతాయని అంచనా వేయబడింది. ఈ సంఖ్య భారతదేశంలో తయారైన ఫోన్‌ల మొత్తం ఎగుమతిలో సగం. ఢిల్లీలో ప్రధానితో పాటు టిమ్ కుక్ ఢిల్లీలో ప్రధానితో పాటు సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను కూడా కలవనున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం