Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ఒక్క ఏడాదిలో 400శాతం లాభం.. ఈ స్టాక్.. హాట్ కేక్.. పూర్తి వివరాలు

మార్కెట్ పై అవగాహన లేకుండా దీనిలో పెట్టుబడి పెట్టొద్దని నిపుణులు సూచిస్తుంటారు. అయితే దీర్ఘకాలంలో ఇవి సాధారణంగా మంచి రాబడులిస్తాయి. అయితే ఓ స్టాక్ మాత్రం మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒక ఏడాదిలోనే ఏకంగా 400శాతం రాబడిని మదుపరులకు అందించింది. అంటే ఒక లక్ష పెట్టుబడి పెడితే అది ఏడాది రూ. 4లక్షలు అయ్యిందన్న మాట. ఆ స్టాక్ ఏంటి?

Stock Market: ఒక్క ఏడాదిలో 400శాతం లాభం.. ఈ స్టాక్.. హాట్ కేక్.. పూర్తి వివరాలు
Stock Market
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2023 | 9:20 PM

స్టాక్ మార్కెట్ అస్థిరతకు పెట్టింది పేరు. ఎప్పుడు ఏ స్టాక్ ఉవ్వెత్తున ఎగిసి లాభాలు తెచ్చిపెడుతుందో, ఎప్పుడు కుదేలై నష్టాలపాలు చేస్తుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు ఈ మార్కెట్ పై అవగాహన లేకుండా దీనిలో పెట్టుబడి పెట్టొద్దని నిపుణులు సూచిస్తుంటారు. అయితే దీర్ఘకాలంలో ఇవి సాధారణంగా మంచి రాబడులిస్తాయి. అయితే ఓ స్టాక్ మాత్రం మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒక ఏడాదిలోనే ఏకంగా 400శాతం రాబడిని మదుపరులకు అందించింది. అంటే ఒక లక్ష పెట్టుబడి పెడితే అది ఏడాది రూ. 4లక్షలు అయ్యిందన్న మాట. ఆ మల్టీ బ్యాగర్ స్టాక్ ఏంటి? దాని పనితీరు ఎలా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

సుజ్లాన్ ఎనర్జీ స్టాక్..

గ్లోబల్ ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో చేర్చిన తరువాత పునరుత్పాదక ఇంధన సంస్థ సుజ్లాన్ ఎనర్జీ నుంచి వచ్చిన ఎస్144- 3 మెగావాట్ల సిరీస్ విండ్ టర్బైన్‌లను ప్రభుత్వం లిస్టింగ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ మొత్తం ఈ స్టాక్స్ వైపు చూస్తోంది. గ

ఎస్144- 3ఎండబ్ల్యూ సిరీస్ విండ్ టర్బైన్‌లు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) నుంచి జాబితా చేయబడిన మోడల్స్ అండ్ తయారీదారుల సవరించిన జాబితాను పొందాయని పునరుత్పాదక ఇంధన పరిష్కారాల ప్రొవైడర్ సుజ్లాన్ ఎనర్జీ గత బుధవారం తెలిపింది. తమ ఉత్పత్తి వాణిజ్యీకరణకు ఇది విజయవంతమైన మైలురాయిగా ఆ కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

లాభాల బాటలో షేర్లు..

తులసి తంతి స్థాపించిన ఈ విండ్ ఎనర్జీ మేజర్, గత కొన్నిసెషన్‌ల నుండి స్టాక్‌ మార్కెట్‌లో స్టెల్లార్ రన్‌లో కొనసాగుతోంది. 12 సెషన్లలో 11 సెషన్లలో గ్రీన్‌లో ముగియడం ద్వారా నెల ప్రారంభం నుండి సుజ్లాన్ ఎనర్జీ షేర్లు లాభపడుతున్నాయి. గత గురువారం బీఎస్‌ఇలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ 3.88% లాభంతో రూ. 42.06 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్‌ఇలో ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 42.5కి పెరిగింది. సంవత్సరం ప్రారంభంలో స్టాక్ ఎక్స్ఛేంజీలలో కంపెనీ షేర్లు స్టెల్లార్ రన్‌లో ఉన్నాయి. స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 300%, గత మూడు నెలల్లో 100% కంటే ఎక్కువ లాభపడింది. గత నెలలో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు 50% రాబడిని ఇచ్చింది.

మార్చి 28, 2023న, ఈ షేరు ఏడాది కనిష్ట స్థాయి రూ.6.96కి చేరుకుంది. ఈ రోజు నాటికి, బీఎస్‌ఇలో ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో రూ.42.5కి ఎగబాకింది. ఉదాహరణకు, ఈ స్టాక్‌లో ఏడాది క్రితం చేసిన రూ. 1 లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ. 4,18,62,000గా మారిపోయింది. అంటే గత ఏడాదిలో 418.62% రాబడిని అందించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..