AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Refueling: కంటికి కనిపించని మోసం.. పెట్రోల్ బంకుల్లో తస్మాత్ జాగ్రత్త!

మీ కారులో పెట్రోల్/డీజిల్‌ను నింపడం చాలా సులభమైన పనిలా అనిపించవచ్చు. అయితే బంకుల్లో మోసాలపై అప్రమత్తంగా లేకపోతే నష్టపోయే అవకాశాలుంటాయి. ఎక్కువ మొత్తంలో పెట్రోల్/డీజిల్ కొడుతున్నట్లు చూపిస్తూ.. తక్కువ లీటర్లు కొట్టి మోసం చేస్తూ ఉంటారు. అందుకే ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

Car Refueling: కంటికి కనిపించని మోసం.. పెట్రోల్ బంకుల్లో తస్మాత్ జాగ్రత్త!
Car Refueling
Madhu
| Edited By: |

Updated on: Nov 20, 2023 | 9:40 PM

Share

ఇటీవల కాలంలో అందరూ కారును కలిగి ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కరోనా అనంతర పరిణామాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ వినియోగించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. కుటుంబంతో కలిసి సొంత వాహనం కలిగి ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే కారును కలిగి ఉండటమే కాదు.. దాని మెయింటెనెన్స్ కు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే కారును కలిగి ఉన్న వారు ఇస్తారు కూడా. అయితే ఒక్క విషయంలో కాస్త నిర్లిప్తంగా ఉంటారు. అదెప్పుడూ అంటే కారులో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేటప్పుడు. ఆ సమయంలోనే ఎక్కువ మోసపోయేందుకు ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు.  పెట్రోల్ బంకుల్లో ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం..

మోసపోకుండా ఉండాలంటే..

మీ కారులో పెట్రోల్/డీజిల్‌ను నింపడం చాలా సులభమైన పనిలా అనిపించవచ్చు. అయితే బంకుల్లో మోసాలపై అప్రమత్తంగా లేకపోతే నష్టపోయే అవకాశాలుంటాయి. ఎక్కువ మొత్తంలో పెట్రోల్/డీజిల్ కొడుతున్నట్లు చూపిస్తూ.. తక్కువ లీటర్లు కొట్టి మోసం చేస్తూ ఉంటారు. అందుకే ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం ఓ ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. ఆ ట్వీట్‌లో, “వినియోగదారులారా, గమనించండి! పెట్రోల్, డీజిల్‌ను నింపే ముందు ఈ పాయింట్‌లను గుర్తుంచుకోండి: డిస్పెన్సింగ్ మెషీన్ ధృవీకరణ సర్టిఫికెట్ కనిపించాలి, మీటర్ రీడింగ్ 0.00 ఉండాలి. కస్టమర్‌లు వారు ఎంచుకుంటే డెలివరీ చేయబడిన పరిమాణాన్ని ధృవీకరించడానికి గ్యాస్ పంపు వద్ద ఐదు-లీటర్ స్కేల్‌ని ఉపయోగించవచ్చు”. అని పేర్కొంది. కస్టమర్లకు ఏవైనా సందేహాలు ఉంటే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915 లేదా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరించింది. పెట్రోల్ సాంద్రతలో ఏదైనా వ్యత్యాసం ఉంటే, మీరు చాలా డబ్బును కోల్పోవచ్చు. సాంద్రత నేరుగా పెట్రోల్ లేదా డీజిల్ స్వచ్ఛతకు సంబంధించినది కావడం గమనార్హం.

ఇంకా, కొన్నిసార్లు ఎంబెడెడ్ చిప్ పంప్‌లోనే చొప్పించబడినందున, గ్యాస్ పంపుల నిర్వాహకులు లేదా ప్రాథమిక యజమానులచే స్పష్టమైన మోసం ఉంది. మీటర్ పూర్తి మొత్తాన్ని చూపడంతో, ఈ చిప్ ప్రతిసారీ 3% తక్కువ ఆయిల్ ను అందిస్తుంది. ఈ విధంగా, అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా, మీరు రూ. 1,000 విలువైన పెట్రోల్‌ను అభ్యర్థించినప్పటికీ, మీకు రూ. 970 విలువైన పెట్రోల్ మాత్రమే అందుతుంది.

అందుకే వినియోగదారులు పెట్రోల్ బంకుల్లో మోసాలపై అప్రమత్తంగా ఉండాలని లేకుంటే మోసపోతారని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. బోర్డులో జీరో ఇండికేషన్ చూసుకోవడం, అవసరం అయితే కారు దిగి తనిఖీ చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..