Special Scheme: ఎల్‌ఐసీ పథకంపై ఈ బ్యాంకు కీలక నిర్ణయం.. స్కీమ్‌ గడువు పొడిగింపు

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీకి చెందిన ఐడీబీఐ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం తేదీని వాయిదా వేసింది. ఆర్‌బీఐ వరుసగా 7వ సారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయని తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో పాలసీ రేట్లు ఇప్పటికీ అత్యధిక స్థాయిలో 6.50 శాతంగా ఉన్నాయి. IDBI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ ప్రత్యేక ఉత్సవ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌..

Special Scheme: ఎల్‌ఐసీ పథకంపై ఈ బ్యాంకు కీలక నిర్ణయం.. స్కీమ్‌ గడువు పొడిగింపు
Fd Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Apr 07, 2024 | 10:32 AM

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీకి చెందిన ఐడీబీఐ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం తేదీని వాయిదా వేసింది. ఆర్‌బీఐ వరుసగా 7వ సారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయని తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో పాలసీ రేట్లు ఇప్పటికీ అత్యధిక స్థాయిలో 6.50 శాతంగా ఉన్నాయి.

IDBI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ ప్రత్యేక ఉత్సవ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చెల్లుబాటు తేదీని 300 రోజులు, 375 రోజులు, 444 రోజులు పొడిగించింది. బ్యాంక్ ప్రకారం.. ఇంతకుముందు ఈ ప్రత్యేక ఎఫ్‌డీల టైమ్‌లైన్ మార్చి 31, 2024 వరకు గడువు ఉండగా, దీనిని జూన్ 30, 2024 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసకుంది. ప్రస్తుతం ప్రత్యేక ఎఫ్‌డీలో ఇన్వెస్టర్లు ఎంత రాబడిని పొందుతున్నారో తెలుసుకుందాం.

ఉత్సవ్ ఎఫ్‌డి 300 రోజులు: సీనియర్ సిటిజన్‌లకు బ్యాంక్ ఈ ఎఫ్‌డిపై 7.55 శాతం వడ్డీని ఇస్తుంది. బ్యాంక్ 300 రోజుల అమృత్ మహోత్సవ్ FD పథకం కింద సాధారణ, NRE మరియు NRO వినియోగదారులకు 7.05 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాకుండా, ఇది అకాల ఉపసంహరణ మరియు మూసివేత సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

ఉత్సవ్ FD 375 రోజులు: బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు ఈ ఎఫ్‌డీపై 7.60 శాతం వడ్డీని ఇస్తుంది. అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డి పథకం కింద సాధారణ, ఎన్‌ఆర్‌ఇ, ఎన్‌ఆర్‌ఓ కస్టమర్లకు 375 రోజుల పాటు బ్యాంక్ 7.10 శాతం వడ్డీని అందిస్తుంది. అదనంగా అకాల ఉపసంహరణలు, మూసివేతలు కూడా అనుతిస్తారు.

ఉత్సవ్ FD 444 రోజులు: ఈ పథకం కింద బ్యాంక్ సాధారణ ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ వినియోగదారులకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం కోసం సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 7.75 శాతం వడ్డీని ఇస్తుంది.

ప్రత్యేక ఎఫ్‌డీ ప్రత్యేకతలు

  • ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లకు 300 రోజుల ప్రత్యేక FD వర్తించదు.
  • మెచ్యూర్‌కు ముందు ఉపసంహరణ/మూసివేయడం అనుమతిస్తారు.
  • NRO, NRE ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉద్యోగి, సీనియర్ సిటిజన్‌ల రేట్లు వర్తించవు.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ అన్ని ఇతర ఫీచర్లు, నిబంధనలు, షరతులు మారవు. పై స్కీమ్‌కు కూడా వర్తిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి