Gold Price Today: తగ్గేదేలేదంటున్న బంగారం.. రూ.లక్ష టార్గెట్‌గా దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలు..
పసిడి ధర ఛాలెంజ్ విసురుతోంది. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ సామాన్యులకు సవాల్ విసురుతోంది. పసిడి ధర పెరగడమేగానీ, తగ్గేలా కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ రేటులో స్పీడు అందుకుని.. లక్ష టార్గెట్‌గా దూసుకుపోతోంది. శనివారం బంగారం ధరల్లో మరో సరికొత్త రికార్డు నమోదైంది.. మేలిమి బంగారం 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.73వేలు దాటగా.. వెండి కిలో ధర రూ.83వేలుగా నమోదైంది.
పసిడి ధర ఛాలెంజ్ విసురుతోంది. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ సామాన్యులకు సవాల్ విసురుతోంది. పసిడి ధర పెరగడమేగానీ, తగ్గేలా కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ రేటులో స్పీడు అందుకుని.. లక్ష టార్గెట్‌గా దూసుకుపోతోంది. శనివారం బంగారం ధరల్లో మరో సరికొత్త రికార్డు నమోదైంది.. మేలిమి బంగారం 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.73వేలు దాటగా.. వెండి కిలో ధర రూ.83వేలుగా నమోదైంది. పుత్తడి ధరలు ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు ఎలా ఉంటాయోనని ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా.. ఆదివారం (ఏప్రిల్ 7 2024) 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,290 లుగా ఉంది.. వెండి కిలో ధర రూ.83,500లుగా ఉంది.
ప్రధాన బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో బంగారం 10 గ్రాముల ధర 22 క్యారెట్లు రూ.65,500, 24 క్యారెట్లు రూ.71,440 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.65,350, 24క్యారెట్లు రూ.71,290, చెన్నైలో 22క్యారెట్లు రూ.66,150, 24 క్యారెట్లు రూ.72,160, బెంగళూరులో 22క్యారెట్లు రూ.65,350, 24 క్యారెట్లు రూ.71,290, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22క్యారెట్లు రూ.65,350, 24 క్యారెట్లు రూ.71,290 లుగా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.83,500, ముంబైలో రూ.83,500, బెంగళూరులో రూ.82,000, చెన్నైలో రూ.87,000, హైదరాబాద్‌లో రూ.87,000, విజయవాడలో రూ.87,000, విశాఖపట్నంలో రూ.87,000 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..