Tax Saving Schemes: మహిళా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఇలా చేస్తే రూ. 1.5లక్షల వరకూ పన్ను ఆదా..
మహిళలు పన్ను ఆదా చేసుకోవడంతో పాటు అధిక రాబడినిచ్చే పథకాలు.. అవి కూడా ప్రభుత్వ భరోసా ఉండే పథకాలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అలాంటి వాటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వంటివి ఉన్నాయి.

మన దేశంలోని కుటుంబ వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలన్నీ ఎక్కువ శాతం పురుషులే నిర్వహిస్తుంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా పురుషులే చేస్తుంటారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మహిళలే ఎక్కువగా ఆర్థిక వేత్తలుగా ఉంటున్నారు. చాలా పైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ కి మహిళలే అధిపతులుగా ఉంటున్నాయి. మన కుటుంబాల్లో కూడా మహిళలు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించగలరు. వారికి తగిన ప్రోత్సాహం అందించాలి. అందుకు ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తోంది. పలు పథకాల ద్వారా పన్ను మినహాయింపులు అందిస్తోంది. అలాగే ఉద్యోగం చేసే మహిళలు ఆర్థిక క్రమ శిక్షణ పాటించడంతో పాటు పొదుపుపై కూడా దృష్టి సారించాలి. కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలి. పిల్లల భవిష్యత్తు తో పాటు వారి ఆరోగ్య అవసరాలకు కూడా డబ్బును దాచుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చే వారైతే పన్ను మినిహాయింపులను కూడా అంది పుచ్చుకోవాలి. అందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడు రాబడితో పాటు పన్ను ఆదా ద్వారా లాభం పొందే అవకాశం ఉంటుంది.
ఇవి బెస్ట్ ఆప్షన్లు..
మహిళలు పన్ను ఆదా చేసుకోవడంతో పాటు అధిక రాబడినిచ్చే పథకాలు.. అవి కూడా ప్రభుత్వ భరోసా ఉండే పథకాలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అలాంటి వాటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వంటివి ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1.5లక్షల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా మహిళలు తమ ఆదాయంపై రూ.50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద స్వీయ, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల ఆరోగ్య బీమా పాలసీల కోసం చెల్లించే ప్రీమియంలపై కూడా పన్ను ఆదా పొందవచ్చు. ధార్మిక సంస్థలకు ఇచ్చే విరాళాలు సెక్షన్ 80జీ కింద మినహాయింపులు పొందుతారు. ఈ నేపథ్యంలో పలు పన్ను ఆదా చేసే పథకాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సుకన్య సమృద్ధి యోజన.. మీ కుమార్తెకు 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, ఆమె 21 ఏళ్లు వచ్చే వరకు మీరు ఈ పథకంలో ఆమె పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఇది సెక్షన్ 80సీ కింద అధిక రాబడి, పన్ను మినహాయింపును అందిస్తుంది.
ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్).. ఈ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వలన సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. దీనిలో కూడా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుతో రూ. 1.5 లక్షల వరకు వార్షిక పెట్టుబడులను అనుమతించే దీర్ఘకాలిక పెట్టుబడి పథకం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్).. ఈ పథకంలో కూడా సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ. 50,000 వరకు అదనపు మినహాయింపును లభిస్తుంది.
గృహ రుణాలపై పన్ను మినహాయింపు.. ఒక మహిళ పేరు మీద గృహ రుణం తీసుకుంటే, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 24 ప్రకారం, సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. అదనంగా, సెక్షన్ 80ఈఈఏ కింద, మొదటిసారి గృహ కొనుగోలుదారులు గృహ రుణ వడ్డీపై రూ. 1.5 లక్షల వరకు అదనపు మినహాయింపును పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..