Special FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొంటున్నారా? అధికంగా వడ్డీ ఇచ్చే బ్యాంకులివే.. ఓ లుక్కేయండి..
బ్యాంకు నుంచి బ్యాంకులకు కూడా వడ్డీ రేట్లు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గతేడాది నుంచి రెపోరేటు పెంచుతూ ఉండటంతో అన్ని బ్యాంకులు ఎఫ్ డీ లపై వడ్డీ రేట్లను పెంచాయి. కొన్ని బ్యాంకులు తమ ఉత్తమ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల సమయాన్ని పొడిగించాయి.

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్. రిస్క్ లేని స్థిర ఆదాయ మార్గంగా అందరూ దీనిని భావిస్తారు. అధిక వడ్డీతో పాటు పన్ను రాయితీలు, ప్రభుత్వ భరోసా వెరసి ఈ పథకాన్ని ప్రజలకు చేరువు చేశాయి. ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలు బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో ప్రారంభించవచ్చు. వడ్డీ రేట్లలో మాత్రం స్వల్ప తేడాలుంటాయి. బ్యాంకు నుంచి బ్యాంకులకు కూడా వడ్డీ రేట్లు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గతేడాది నుంచి రెపోరేటు పెంచుతూ ఉండటంతో అన్ని బ్యాంకులు ఎఫ్ డీ లపై వడ్డీ రేట్లను పెంచాయి. కొన్ని బ్యాంకులు తమ ఉత్తమ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల సమయాన్ని పొడిగించాయి. ఈ క్రమంలో వివిధ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎఫ్ డీ లు ఎంటి? వాటిల్లో వడ్డీ శాతాలు ఎలా ఉన్నాయి. వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎస్బీఐ అమృత్ కలష్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన అమృత్ కలష్ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. వాస్తవానికి మార్చి చివరికే ఈ పథకం డెడ్ లైన్ ముగిసింది. కానీ తిరిగి దీనిని ప్రారంభిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. 400 రోజుల టెన్యూర్ తో దీనిని నిర్వహిస్తోంది. 2023, జూన్ 30 వరకూ దీనిలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. దీనిలోని పెట్టుబడికి సాధారణ పౌరులకు 7.10శాతం, వృద్ధులకు 7.60 శాతం వరకూ వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తుంది.
ఎస్బీఐ సర్వోత్తమ్.. రూ. 15లక్షలు, అంతకు మించిన పెట్టుబడుల కోసం ఎస్బీఐ సర్వోత్తమ్ పేరిట ఓ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దీనిలో దేశ నివాసులతో పటు నాన్ రెసిడెంట్ల్ కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఒక సంవ్సతరం, రెండు సంవ్సతరాల కాల వ్యవధితో టెర్మ్ డిపాజిట్ కి అవకాశం కల్పిస్తుంది. వడ్డ రేట్లు కార్డు రేటు కన్నా 30 నుంచి 40 బేస్ పాయింట్లు అధికంగా ఉంటాయి.
ఐడీబీఐ అమృత్ మహోత్సవ్.. ఈ ఎఫ్‌డీ 444 రోజుల కాల వ్యవధితో వస్తుంది. దీనిలో సాధారణ పౌరులకు 7.15శాతం వడ్డీ వస్తుంది. అదే వృద్ధులు, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓలకు 7.65శాతం వడ్డీని బ్యాంకు అందిస్తుంది.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ.. ఈ ప్రత్యేకమైన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాన్ని ఇండియన్ బ్యాంకు ‘ఐఎన్డీ సూపర్ 400 డేస్’ పేరిట రీ లాంచ్ చేసింది. వడ్డీ రేటు 10 బేస్ పాయింట్లు పెంచింది. 2023 ఏప్రిల్ 20 నుంచి పెరిగిన వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. జూన్ 30 వరకూ దీనిలో ఖాతా ప్రారంభించేందుకు అవకాశం ఉంది. కనీసం రూ. 10,000 నుంచి రూ. 2 కోట్ల వరకూ 400 రోజుల కాల వ్యవధితో దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు.
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ.. ఈ బ్యాంకు గతంలో అమలు చేసి పీఎస్బీ 300, పీఎస్బీ ఫ్యాబ్యూలస్ ప్లస్ 601, పీఎస్బీ ఉత్కర్ష్ 222డేస్ వంటి పథకాలను క్లోజ్ చేసింది. అయితే ఇటీవల ప్రత్యేకమైన వడ్డీ రేటుతో స్పెషల్ రేట్ ఫర్ స్పెషల్ డేస్(ఎస్ఆర్ఎస్డీ-1051), పీఎస్బీ గృహ లక్ష్మీ ఫిక్స్ డ్ డిపాజిట్ వంటి పథకాలను ప్రారంభించింది.
- ఎస్ఆర్ఎస్డీ-1051 పథకం 1051 రోజుల కాలవ్యవధితో ఉంటుంది. జూన్ 30 వరకూ దీనిలో ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. కనీస మొత్తం రూ. 25,000తో రూ. 5000 గుణిజాలతో రూ. 2 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
- పీఎస్బీ గృహ లక్ష్మీ పథకం పూర్తిగా మహిళలకు ఉద్దేశించిన పథకం. దీనిలో తల్లి కూతుళ్లు కలసి జాయింట్ గా ఖాతా ప్రారంభించవచ్చు. 551రోజుల కాల వ్యవధితో ఇది ఉంటుంది. జూన్ 30 వరకూ ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. కనీసం రూ. 5000తో ఖాతా ప్రారంభించవచ్చు.
సీనియర్ సిటిజెన్స్ కోసం.. వయో వృద్ధుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఎస్బీఐ వీ కేర్ లో అధిక వడ్డీ రేటు లభిస్తుంది. దాదాపు 7.50 శాతం వడ్డీ అందుతుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు కూడా గోల్డెన్ ఇయర్స్ ఎఫ్ డీ ని ప్రారంభించింది. హెచ్ డీ ఎఫ్సీ, ఐడీబీఐ కూడా వృద్ధుల కోసం ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..