Year Ender 2023: ఈ ఏడాది రైల్వే తెచ్చిన మార్పులు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.?
మరికొన్ని రోజుల్లో మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. దీంతో కొత్తేడాదికి కొత్త ఉత్సాహంతో ఆహ్వానం పలికేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. మరి 2023లో భారతీయ రైల్వే కొత్తగా చేసిన మార్పులు ఏంటి.? వీటి వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి లాభాలు కలిగాయి.? లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
2023 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. దీంతో కొత్తేడాదికి కొత్త ఉత్సాహంతో ఆహ్వానం పలికేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. మరి 2023లో భారతీయ రైల్వే కొత్తగా చేసిన మార్పులు ఏంటి.? వీటి వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి లాభాలు కలిగాయి.? లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇండియన్ రైల్వే ఈ ఏడాది చేసిన మార్పులో ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం. సాధారణంగా జనరల్ టికెట్స్‌ను రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇండియన్ రైల్వే ఈ టికెట్స్‌ను కూడా అన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం యూటీఎస్ పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ సహాయంతో ప్రయాణికులు నేరుగా ఫోన్‌లోనే జనరల్ టికెట్‌ను సైతం బుక్ చేసుకోవచ్చు.
* ఇకపై వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా చేసేందుకు ఇండియన్ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. భారత్‌లో ప్రతీ ఏటా రైల్వేను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో తత్కాల్ టిక్ బుక్ చేసుకోవడం, కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూడడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూనుకున్నారు. వెయిటింగ్ లిస్ట్ లేకుండా ఉండేందుకు మరిన్ని రైళ్లను నడపాలని నిర్ణయించారు.
* ఇక ఈ ఏడాది ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన మరో మార్పు.. సాధారణంగా రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టీటీఈ ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తే చెక్ చేసి జరిమానా విధిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో రాత్రుళ్లు ప్రయాణికులు పడుకున్న తర్వాత టీటీఈలు వచ్చి టికెట్ చేస్తుంటారు. దీంతో ప్రయాణికులు నిద్రం భంగం కలుగుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు కలుగుతోన్న అసౌకర్యానికి చెక్ పెట్టేందుకు రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ టికెట్ తనిఖీ చేయకూడదనే నిబంధనను రూపొందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..