OYO: హోటల్స్ బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్.. ఓయో ట్రావెలో పీడియా నివేదికలో
ఓయో ట్రావెలో పీడియో నివేదికగా ఆధారంగా ఈ ఏడాది అత్యధిక పర్యాటకులు హోటల్ గదులను బుక్ చేసుకున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇక ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ నివేదికలో వివరించిన అంశాల ప్రకారం.. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యధిక బుకింగ్స్ జరిగినట్లు తెలిపారు. ఇక అత్యధికంగా హోటల్స్ బుక్ చేసుకున్న నగరాల..
కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో పర్యాటకం ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాయదారి దాటికి పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. ప్రజలు ప్రయాణాలను మానుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మళ్లీ పర్యాటకులు పెరిగిపోయారు. ఈ క్రమంలోనే 2023లో అత్యధిక పర్యాటకులు ఎక్కడ రూమ్ బుక్ చేసుకున్నారన్న దానిపై ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ అయిన ఓయో ఓ నివేదిక విడుదల చేసింది.
ఓయో ట్రావెలో పీడియో నివేదికగా ఆధారంగా ఈ ఏడాది అత్యధిక పర్యాటకులు హోటల్ గదులను బుక్ చేసుకున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇక ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ నివేదికలో వివరించిన అంశాల ప్రకారం.. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యధిక బుకింగ్స్ జరిగినట్లు తెలిపారు. ఇక అత్యధికంగా హోటల్స్ బుక్ చేసుకున్న నగరాల జాబితాలో రెండో స్థానంలో బెంగళూరు, మూడో స్థానలో ఢిల్లీ, నాల్గవ స్థానంలో కోల్‌కతా నిలిచాయి.
ఇక 2022తో పోల్చితే 2023లో చిన్న పట్టణాలైన వరంగల్, గుంటూరు, యూపీలోని గోరఖ్ పూర్, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా పట్టణాల్లో అత్యధిక బుకింగ్‌లు జరిగాయి. అలాగే ఎక్కువ హోటల్స్ బుకింగ్ జరిగిన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పూరీ మొదటి స్థానంలో నిలవగా.. అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేవ్‌ఘర్, పళని, గోవర్ధన్ లాంటి ప్రదేశాల్లోనూ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి. ఎక్కువ మంది హోటల్స్ బుక్ చేసుకున్న రాష్ట్రాల జాబితా విషయానికొస్తే.. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలవగా తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి.
2023లో ఎక్కువ హోటల్ బుకింగ్స్ జరిగిన రోజుగా సెప్టెంబర్ 30నిలవగా, అత్యధిక బుకింగ్స్ జరిగిన నెలగా మే ఉంది. ఇదే విషయమై ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్‌బోలే మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల తర్వాత పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి 2023లో చేరుకుందన్నారు. అందుకే ప్రయాణాలకు సంబంధించి 2023 ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. భారత్‌లో వ్యాపార ప్రయాణాలు సైతం వృద్ధికి మద్ధతిస్తున్నాయని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..