Car loan: కార్ లోన్ తీసుకుంటున్నారా? వీటి గురించి ముందు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..

సాధారణంగా కొత్త కార్ల కొనుగోలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలను మంజూరు చేస్తాయి. ఆ తర్వాత నెలవారీ వాయిదాల రూపంలో రుణాన్ని వడ్డీతో  సహా తీర్చాలి. రుణ కాలవ్యవధి మూడు నుంచి ఏడేళ్ల వరకూ ఉంటుంది. ఈఎమ్ఐలను సక్రమంగా చెల్లించడం చాలా అవసరం. లేకపోతే జరిమానా రూపంలో అదనపు ఖర్చు పడుతుంది.

Car loan: కార్ లోన్ తీసుకుంటున్నారా? వీటి గురించి ముందు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..
Car Loan
Follow us

|

Updated on: Jul 23, 2024 | 5:15 PM

దేశంలో కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. వివిధ కంపెనీల నుంచి అనేక కొత్త కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటి ధరలు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రయాణం తదితర అవసరాల కోసం కారు తప్పనిసరిగా మారింది. కారు కొనుగోలు చేసే సామర్థ్యం ఉంటే ఇబ్బంది లేదు. లేకపోతే మాత్రం రుణాల మీద ఆధారపడాల్సిందే. సాధారణంగా కొత్త కార్ల కొనుగోలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలను మంజూరు చేస్తాయి. ఆ తర్వాత నెలవారీ వాయిదాల రూపంలో రుణాన్ని వడ్డీతో  సహా తీర్చాలి. రుణ కాలవ్యవధి మూడు నుంచి ఏడేళ్ల వరకూ ఉంటుంది.

గమనించాల్సిన అంశాలు..

కారు కొనుగోలు చేయడానికి రుణం తీసుకునే ముందు వివిధ అంశాలను ఆలోచించాలి. మీ ఆదాయం, ఖర్చులను లెక్కవేసుకోవాలి. ముఖ్యంగా ఈఎమ్ఐలను సక్రమంగా చెల్లించడం చాలా అవసరం. లేకపోతే జరిమానా రూపంలో అదనపు ఖర్చు పడుతుంది.

నష్టాలు ఇవే..

మీకు నిర్ణీత ఆదాయం ఉంటే కారు కొనుగోలు చేయడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలను త్వరగానే మంజూరు చేస్తాయి. అయితే వాటిని తీసుకోవడం వల్ల అన్ని నష్టాలు కూడా కలుగుతాయి. వాటిని ముందు పరిశీలించడం చాలా అవసరం.

రుణ భారం.. రుణం తీసుకోవడం వల్ల మీపై ఆర్థిక భారం పెరుగుతుంది. మీ ప్రణాళికపై గణనీయ ప్రభావం చూపుతుంది. మీరు సమయానికి ఈఎమ్ఐ చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ పై నెగెటిక్ ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో రుణం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి.

వడ్డీ.. తీసుకున్న రుణానికి వడ్డీ విధిస్తారు. రుణంతో పాటు వడ్డీని కలిసి ఈఎమ్ఐలుగా చెల్లించాలి. ఇది అదనపు భారంగా మారుతుంది. చివరకు కారు ధరను గణనీయంగా పెంచుతుంది. దీర్ఘకాలిక రుణంపై వడ్డీ మొత్తం కారు ధర కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇబ్బందులు.. లోన్ పై కారు కొనుగోలు చేసిన తర్వాత దానిని సులభంగా విక్రయించలేదు. అత్యవసర సమయంలో అమ్మాలంటే లోన్ చెల్లించిన తర్వాత సర్టిఫికెట్ ఉండాలి. కారును కొనుగోలు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా దాన్ని పరిశీలిస్తారు.

ఖర్చులు పెరిగే అవకాశం.. కారు తీసుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్ కు ఖర్చు అవుతుంది. అలాగే బీమా ను కూడా తీసుకోవాలి. వీటి కోసం కొంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మీరు ప్రతి నెలా చెల్లించే ఈఎమ్ఐకి ఇవి అదనంగా ఉంటాయి. తద్వారా మీకు ఖర్చులు పెరుగుతాయి. వీటికి అనుగుణంగా మీ ఆదాయం ఉండకపోతే బయట అప్పులు చేయాల్సి ఉంటుంది.

రీసేల్ విలువ.. లోన్ తీసుకుని కారు కొంటే మీరు చెల్లించే ఈఎమ్ఐలు దాని ధర కంటే బాగా ఎక్కువ అవుతాయి. ఎందుకుంటే వడ్డీ రూపంలో మీకు అదనపు భారం పడుతుంది. అలాగే మీరు కారును అమ్మివేయాలనుకున్నప్పుడు దాని ధర బాగా తగ్గిపోతుంది.

ప్రణాళిక లేకుంటే.. ఏది ఏమైనా కారును తీసుకోవాలంటే మీకు పక్కా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ ఆదాయాన్ని అనుసరించి సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల అనుకోని ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..