AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric vehicles: చేతక్, ఓలా స్కూటర్లలో ఏదీ బెస్ట్? వాటి మధ్య తేడాలు, ప్రత్యేకతలు ఇవే..

ప్రముఖ కంపెనీ బజాజ్ తన చేతక్ 2901 ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. పాత బజాజ్ చేతక్ ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు. ఫ్యామిలీ స్కూటర్ గా అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో కొత్త బజాజ్ చేతక్ 2901 ఈవీ కి ప్రజల మద్దతు లభిస్తోంది. దీనికి ప్రత్యర్థిగా భావిస్తున్న ఓలా ఎస్1 ఎక్స్ కూడా అమ్మకాలతో దూసుకుపోతోంది.

Electric vehicles: చేతక్, ఓలా స్కూటర్లలో ఏదీ బెస్ట్? వాటి మధ్య తేడాలు, ప్రత్యేకతలు ఇవే..
Bajaj Chetak 2901 Vs Ola S1 X
Madhu
|

Updated on: Jun 23, 2024 | 12:37 PM

Share

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల హవా నడుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ, అదిరే స్పీడ్, అనువైన రేంజ్ తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీలు తమ ఈవీ స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. వీటికి ప్రజల ఆదరణ లభిస్తుండడంతో రోజుకో మోడల్ బండి మార్కెట్ లో సందడి చేస్తోంది.

రెండు ఈవీల మధ్య తేడాలివే..

ప్రముఖ కంపెనీ బజాజ్ తన చేతక్ 2901 ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. పాత బజాజ్ చేతక్ ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు. ఫ్యామిలీ స్కూటర్ గా అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో కొత్త బజాజ్ చేతక్ 2901 ఈవీ కి ప్రజల మద్దతు లభిస్తోంది. దీనికి ప్రత్యర్థిగా భావిస్తున్న ఓలా ఎస్1 ఎక్స్ కూడా అమ్మకాలతో దూసుకుపోతోంది. ఈ రెండు ప్రముఖ ఈవీల మధ్య తేడాలు, ప్రత్యేకతలు, రేంజ్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం.

డిజైన్..

కొత్త బజాజ్ చేతక్ 2901 ఈవీ డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇంచుమించు మిగిలిన మోడళ్ల మాదిరిగానే ఉంది. దీని బాడీ వర్క్, స్లైలింగ్ అర్బేన్ ప్రీమియం వేరియంట్లలాగే ఉన్నాయి. తక్కువ రంగులలో అందుబాటులో ఉంది. అయితే ఓలా ఎస్1 ఎక్స్ కొంచె భిన్నంగా కనిపిస్తుంది. ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో కంటే కొద్దిగా మార్పులు చేశారు. మొత్తానికి ఈ రెండు స్కూటర్లూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఫీచర్లు..

బజాజ్ చేతక్‌లో ఎల్ఈడీ ఇల్యూమినేషన్, ఎకో మోడ్, డిజిటల్ స్క్రీన్‌ అమర్చారు. స్పోర్ట్స్ రైడింగ్ మోడ్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఓలా ఎస్1 ఎక్స్ ని ఎల్ఈడీ ఇల్యూమినేషన్‌తో రూపొందించారు. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడల్, ఓటీఏ అప్‌డేట్‌లు, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. చేతక్ తో పోల్చితే ఓలా స్కూటర్‌కు మెరుగైన ప్యాకేజీ ఉంది.

మోటార్, బ్యాటరీ..

చేతక్ స్కూటర్ లో 2.8కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు 63 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మరోవైపు ఓలాకు 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సెటప్‌ చేశారు. గంటలకు 85 కిలోమీటర్ల గరిష్టం వేగంతో వెళుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 84 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరో వెర్షన్ లో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెడుతుంది. అలాగే 125 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

హార్డ్ వేర్..

చేతక్ 2901 స్కూటర్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌తో ముందు, వెనుక మోనోషాక్‌పై నడుస్తుంది. ఓలా ఎస్1 ఎక్స్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌లను ఉపయోగిస్తుంది. చేతక్ మాదిరిగానే రెండు చివరలా డ్రమ్ బ్రేక్ సెటప్‌ ఏర్పాటు చేశారు.

ధర వివరాలు..

బజాజ్ చేతక్ 2901 రూ. 95,998 ధరకు అందుబాటులో ఉంది. ఇక ఓలా ఎస్1 ఎక్స్ ఈవీకి సంబంధించి 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ రూ.74,999కు అలాగే 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనం రూ.84,999 (బెంగళూరు ఎక్స్ షోరూమ్ ధరలు) కు అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..