IPO: త్వరలో ఈ కంపెనీలకు కోట్లాభిషేకం.. ఐపీవోకు రంగం సిద్ధం..

దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్‌డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టారు. దీంతో స్టాక్ మార్కెట్ పుంజుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లోకి రావడానికి ఇదే మంచి సమయమని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 30 కంపెనీలు కొన్ని నెలల్లో ఐపీవోకు రానున్నాయి.

IPO: త్వరలో ఈ కంపెనీలకు కోట్లాభిషేకం.. ఐపీవోకు రంగం సిద్ధం..
Ipo
Follow us

|

Updated on: Jun 20, 2024 | 12:00 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఈ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ లో ఆటగాళ్లను వివిధ ప్రాంచైజీలు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తాయి. ఆ ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారికి ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) సుపరిచితమే. ఈ విధానంలో వివిధ కంపెనీలు తమ వాటాలను ప్రజలకు విక్రయిస్తాయి. తద్వారా కోట్లాది రూపాయల మూలధనాన్ని సేకరించుకుంటాయి. అసలు ఐపీవో అంటే ఏమిటి, దాని ద్వారా డబ్బులను ఎలా సేకరిస్తారో తెలుసుకుందాం.

వ్యాపార విస్తరణ కోసం..

ప్రతి కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అనేక ప్రణాళికలు రూపొందిస్తుంది. దాని కార్యకలాపాలను మరింత విస్తరించడం, కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, ఉన్న అప్పులను తీర్చుకోవడం తదితర లక్ష్యాలు ఉంటాయి. వీటినన్నింటినీ సాకారం చేసుకోవాలంటే డబ్బులు చాలా అవసరం. దాని పొగుచేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ప్రధానంగా ఐపీవోకు వెళుతుంది. తన అవసరాలకు మూలధనాన్ని సేకరించుకోవడమే ముఖ్య ధ్యేయం.

ప్రజలే వాటాదారులు..

ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు సంక్షిప్త రూపమే ఐపీవో. ఒక కంపెనీ తన షేర్లను మొదటిసారిగా ప్రజలకు జారీ చేయడాన్నిఐపీవో అంటారు. దీనిలోకి రానంత వరకూ ఆ కంపెనీ ప్రైవేటు యాజమాన్యంలో ఉంటుంది. ప్రజలకు షేర్లు జారీ చేసిన తర్వాత పబ్లిక్‌ ట్రేటెడ్‌ కంపెనీ అవుతుంది. సాధారణంగా కంపెనీలో వాటాదారులు చాలా తక్కువమంది ఉంటారు. అది ఐపీవోకు వెళ్లిన తర్వాత ప్రజలకు షేర్లను విక్రయిస్తుంది. వాటి కొనుగోలు చేసిన ప్రజలందరూ వాటాదారులుగా మారతారు.

ఇదే మంచి సమయం..

దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్‌డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టారు. దీంతో స్టాక్ మార్కెట్ పుంజుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లోకి రావడానికి ఇదే మంచి సమయమని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 30 కంపెనీలు కొన్ని నెలల్లో ఐపీవోకు రానున్నాయి. షేర్లు విక్రయించడం ద్వారా దాదాపు రూ.50 వేల కోట్ల మూలధనాన్ని సేకరించడాన్ని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఐపీవోకు రానున్న కంపెనీలు..

ఓలా ఎలక్ట్రిక్, ఫస్ట్ క్రై, ఫిన్ కేర్ ఎస్ఎఫ్ బీ, ఎన్ఎస్ డీఎల్, అఫ్కాన్స్ ఇఫ్రా, ఎంక్యూర్ ఫార్మా, స్టాన్లీ లైఫ్ స్టైల్స్, వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తదితర కంపెనీలు త్వరలో ఐపీవోకు రానున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ మోటార్, బజార్ స్లైల్ రిటైల్, స్విగ్గీ, హల్దీరామ్స్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మేరకు సెబీకి హ్యుండాయ్ కంపెనీ డ్యాక్యుమెంట్లు కూడా సమర్పించింది. చిరుతిళ్ల తయారీ సంస్థ హల్దీరామ్స్ తన వాటాలను విదేశీ ఇన్వెస్టర్లకు విక్రయించాలన్న నిర్ణయాన్ని వెనకకు తీసుకుంది. ఐపీవో ద్వారా కావాల్సిన మూలధనం సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది. కోల్ కతా కేంద్రంగా పనిచేసే బజార్ స్లైల్ రిటైల్ కూడా ఐపీవో కోసం మార్చిలోనే అప్లికేషన్ పెట్టుకుంది.

మూలధనం సేకరణ..

సెబీ అనుమతుల ప్రకారం స్విగ్గీ రూ.10,414 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ రూ.5,500 కోట్లు, ఫస్ట్ క్రై రూ.1,816 కోట్లు, వన్ మొబిక్విక్ సిస్టమ్ రూ.700 కోట్లు, వారీ ఎనర్జీస్ రూ.3వేల కోట్లు, అలీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టల్లర్స్ రూ.1500 కోట్లు, ఫిన్ కేర్ ఎస్ఎఫ్ బీ రూ.625 కోట్లను ఐపీవో ద్వారా సమకూర్చుకోనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..